భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి

  •  నిలువరించేందుకు యత్నిస్తున్నాం
  • కేంబ్రిడ్జ్ ‌యూనివర్సిటీలో రాహుల్‌ ‌ప్రసంగం
ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మార్చి 3: భారత ప్రజాస్వామ్య వ్యవస్ధపై దాడి జరుగుతోందని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడిని నిలువరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్‌ ఎం‌పీ పేర్కొన్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో శుక్రవారం ఉపన్యసించిన రాహుల్‌ ..‌మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైన వ్యవస్ధలు నిర్భందానికి లోనవుతున్నాయని వ్యాఖ్యానించారు. తనపై నిఘా కోసం ప్రభుత్వం పెగాసస్‌ ‌వాడుతోందని అన్నారు. 21వ శతాబ్దంలో బోధనలు అనే అంశంపై వర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి రాహుల్‌ ‌మాట్లాడారు.విపక్ష నేతలపై నిఘా కోసం ప్రభుత్వం పెగాసస్‌ను వినియోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తన ఫోన్‌పైనా పెగాసస్‌తో నిఘా పెట్టారని వివరించారు. తనతో సహా విపక్ష నేతలపై ఫోన్లపై నిఘా పెట్టారని, తాను ఫోన్‌లో మాట్లాడేసమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.డియా, న్యాయవ్యవస్ధను ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచుకుందని మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో చెలరేగుతూ అసమ్మతిని అణిచివేస్తోందని దుయ్యబట్టారు. వారం రోజుల బ్రిటన్‌ ‌పర్యటనలో భాగంగా రాహుల్‌ ‌గాంధీ బిగ్‌ ‌డేటా, ప్రజాస్వామ్యం, భారత్‌ -‌చైనా సంబంధాలపై జరిగే పలు సెషన్స్‌లో పాల్గొంటారు. ఇండియన్‌ ఓవర్సీస్‌ ‌కాంగ్రెస్‌ ‌బ్రిటన్‌ ‌చాప్టర్‌ ‌ప్రతినిధులతో సంప్రదింపులు జరపడంతో పాటు వారాంతంలో లండన్‌లో జరిగే భారత సంతతికి చెందిన వారితో సమావేశమవుతారు.
సోనియాకు అస్వస్థత..
హాస్పిటల్‌ ‌కు  తరలింపు
image.pngన్యూదిల్ల్ల్లీ,మార్చి3: కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఢిల్లీలోని గంగా రామ్‌ ‌హాస్పి టల్లో చేర్పించారు. బ్రాంకైటీస్‌ ‌వ్యాధికి సోనియా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆమె హాస్పిటల్‌లో చేరడం ఇది రెండవసారి. జనవరిలో కూడా శ్వాసకోశ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో ఆమె బాధపడ్డారు. కొరోనా  తీవ్రంగా ఉన్న సమయంలో కూడా పలుమార్లు ఆమె చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *