ప్రపంచ దేశాలన్నింటిలో ఆహార ఉత్పత్తిలో మన భారత దేశం రెండవ స్థానంలో ఉండడం ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, పోషకాహారలోప సూచీల్లో అగ్రస్థానంలో ఉంటూనే ఆకలి కేకల్లో భారత్ తొలి స్థానంలో నిలవడం ఆశ్చర్యంతో పాటు విచారాన్ని కలిగిస్తున్నది. పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉండగా బియ్యం, గోధుమలు, చక్కర, పల్లికాయ, కూరగాయలు, పండ్లు, చేపల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్నది. ఆహార ధాన్యాల ఉత్పత్తి క్రమేనా పెరిగినా, అదే క్రమంలో ఆకలి కేకలు కూడా పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. గత అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 10 శాతం పోషకాహారలోపంతో, 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరక్కపోవడం గమనించారు. కరోనా వైరస్ విజృంభనతో అదనంగా 11.8 కోట్ల ప్రజలు ఆకలి కోరలలో చిక్కుకున్నారు.
రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు :
2022-23లో 326 మిలియన్ టన్నులు, 2021-22లో 316 మిలియన్ టన్నుల రికార్డ్ స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగి (2020-21లో 311 మిలియన్ టన్నులు, 2019-20లో 298 మిలియన్ టన్నులు, 2018-19లో 285 మిలియన్ టన్నులు) భారత దేశం ఆహారధాన్యాలలో స్వయం సమృద్ధి స్థాయికి చేరినా, పోషకాహారలోపం 2018లో 13.8 శాతం ఉండగా 2020లో 15.3 శాతం వరకు క్రమంగా పెరుగుతూనే ఉన్నది. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికమై, మిగులు స్థాయికి చేరినప్పటికీ నిరుద్యోగం, పేదరికంతో కొనుగోలు సామర్థ్యం కొరవడిన కారణంగా పోషకాహారలోపం, ఆకలి చావులు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో దాదాపు 14 శాతం (అనగా 190 మిలియన్లు) ప్రజలు పోషకాహారలోపంతో, 20 శాతం 5-ఏండ్ల లోపు పిల్లలు తక్కువ బరువుతో, 35 శాతం పిల్లలు స్టంటెడ్ గ్రోత్తో, 52 శాతం 15-49 ఏండ్లలోపు మహిళలు రక్తహీనతతో సతమతం అవుతున్నారు.

ఆకలి కేకల భారతం :
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ -2023 వివరాల ప్రకారం 121 దేశాల్లో ఆకలి సూచికలో భారతదేశ స్థానం అట్టడుగున 107వ స్థానంలో ఉండడం విస్మయాన్ని కలిగిస్తున్నది. 2020లో ఇండియా స్థానం 94 ఉండగా, 2021లో 101 వరకు మరింత దిగజారడం గమనార్హం. 2022 వివరాల ప్రకారం దక్షిణ ఆసియాలోని పొరుగు దేశాలైన శ్రీలంక (64), బంగ్లాదేశ్ (84), నేపాల్ (81), పాకిస్థాన్ (99) హంగర్ సూచికల స్థానాలతో పోల్చితే భారత్ వెనుకబడి ఉండడం విచారకరంగా ఉంది. ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, యఫ్ఏఓ) నిర్వచనం ప్రకారం ఆకలి సూచికలను గణించడానికి పోషకాహారలోపం (అండర్నురిష్మెంట్), చైల్డ్ వేస్టింగ్ (ఎత్తు కన్న తక్కువ బరువు ఉండడం), చైల్డ్ స్టంటింగ్ (వయసు కన్న తక్కువ ఎత్తు ఉండడం), చైల్డ్ మోర్టాలిటీ (పిల్లల మరణాల రేటు) అనబడే 4 అంశాలు పరిగణలోకి తీసుకొన్నారు.

ఆహార భద్రత చర్యలు వెలవెలబోతున్నాయా..!
ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత కార్యక్రమం 1975లో ఇండియా సమగ్ర బాలల అభివృద్ధి సేవలను ప్రారంభించింది. భారత ప్రభుత్వం చేపట్టిన పోషన్ అభియాన్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, మద్యాహ్న భోజన పథకం లాంటి పథకాలతో స్టంటింగ్, వేస్టింగ్, రక్తహీనత, తక్కువ బరువుగల శిశు జననాలను తగ్గించడానికి కృషి జరుగుతోంది. ఆహార భద్రత పథకంలో భాగంగా గర్భిణులు, పిల్లల తల్లులు, బాలలకు పోషకాహారం అందించే ప్రయత్నాలు ముమ్మరంగా చేపడుతున్నారు. పేదల కనీస అవసరాలు తీర్చడానికి ఆయుష్మాన్ భారత్, అంత్యోదయ, పియం కిసాన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల, 100 రోజుల పనికి ఆహారపథకం లాంటివి కూడా ప్రజారోగ్య కల్పనకు దోహదపడుతున్నాయి. ఆహారధాన్యాల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, మిగులు నిల్వలు ఉన్నాయని సగర్వంగా చెప్పుకున్నప్పటికీ, పేదల కడుపుల్లో ఆకలి కేకలు వినపడడం ఆశ్చర్యాన్ని, ఆవేదనని కలిగిస్తున్నది. ఆహార నిల్వలు గోదాముల్లో పందికొక్కుల పాలు కావడంతో పాటు మురికివాడల్లో/గ్రామీణ నిరుపేదల కుటుంబాల కడుపుల్లో ఎలుకలు పరుగెడుతున్నాయి. మన దేశం స్థూలకాయం ఓ వైపున, బక్కచిక్కిన అస్థిపంజర అభాగ్య భారతీయ పేదలు మరో వైపు పెద్ద సమస్యగా నిలుస్తున్నారు. ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పెంచడానికి ఉద్యోగఉపాధుల కల్పన, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు, విద్య వసతుల కల్పన, లింగ సమానత్వ చర్యలు, జనాభా నియంత్రణ లాంటివి జరిగినపుడు అసమానతలు తొలగిపోయి అందరికీ పోషకాహారం అందుబాటులోకి వస్తుంది.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 9949700037
కరీంనగర్ – 9949700037