వేసవిలో వడదెటబ్బ నుంచి రక్షించకోవడానికి ప్రతిఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తలనెప్పి, కండరాలు పట్టేయడం, వికారం, కళ్లుతిగడం, వాంతులు చేసుకోవడం లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లు నిర్ధారించుకోవాలని, వడదెబ్బ తగిలినట్లు గుర్తిస్తే నీటిలో ఓఆర్ఎస్ పొడిని కలిపి తాగాలని, అది దొరకని పరిస్థితుల్లో నీటిలో కొంచం ఉప్పు, పంచదార కలుపుకొని తాగాలని వైద్యులు సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో ఎక్కువ సమయం తిరగరాదని, ఇళ్లు, లేదా చల్లనిగాలి వీచే నీడనిచ్చే ప్రాంతాల్లో ఉండాలన్నారు. విధిగా 5 నుంచి 6 లీటర్ల వరకు నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రల్లో ఉష్ణోగ్ర తలు గరిష్ట స్థాయికి చేరుకు న్నాయి. వడగాలుల తీవ్రత కూడా మొదలైంది. దీంతో ప్రజలు బయటకు రావాలం టేనే భయపడిపోతున్నారు. ప్రతిరోజూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. సోమవారం 40 నుంచి 42 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు.ఇకపై ఈ ఎండ తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు కొంత హెచ్చతగ్గులతో కొనసాగుతున్నాయి.ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత ప్రారంభం కాగా మార్చి ఆరంభంలో 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉన్నా ఈసారి మాత్రం 35 నుంచి 39 డిగ్రీల మధ్య నమోదైంది.మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో మరింతగా పెరిగాయి. కొన్ని చోట్ల 40కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఆ తర్వాత మధ్యలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఉష్ణోగ్రత ఎక్కువ నమోదవుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.కాగా, ఇప్పటికే వడదెబ్బల ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ అత్యంత వేడి నెలగా రికార్డ్ సృష్టించింది. గడిచిన 122 సంవత్సరాలలో ఏప్రిల్ లో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి.వాయువ్య భారతంలో ఏప్రిల్ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 35.9 డిగ్రీలుగా నమోదైంది.మధ్య భారతంలో 37.78 డిగ్రీల సగటు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.ఈ ఏడాది ఏప్రిల్ లో ఎండ తీవ్రత, వడగాల్పులకు ప్రధాన కారణం వర్షాభావ పరిస్థితులేనని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏప్రిల్ లో ఉన్న వేడి, మేలో దాదాపు తగ్గిపోతుందని అంచనా వేస్తోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, దాని ప్రభావంతో మే మొదటి వారం లో అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ తర్వాత అది క్రమేపీ బలపడి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది.ఏదేమైనా ఏప్రిల్ లో ఉగ్రరూపం చూపించిన భానుడు, మే లో శాంతించబోతున్నాడనే ఐఎండీ నివేదిక ఊరటనిస్తోంది. సాధారణంగా వేసవిలో అంటే మే నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.
దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలు ఎంతగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉదయం 9 గంటలకే ఎండ సుర్రుమంటూ దూసుకొస్తోంది.
మధ్యాహ్నం బయట ఎవరూ తిరగలేని పరిస్థితి.నిప్పులు కక్కే ఎండలకు ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.పట్టణంలో ప్రతి సంవత్సరం దాతలు చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు.ఈ ఏడాది వేసవిలో ఇప్పటి వరకు గతంలో మాదిరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దాహంతో అలమటిస్తున్నారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వివిధ గ్రామాలు,పట్టణాలు ప్రజలు వడదెబ్బకు గురువుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్ ల్లో చికిత్స చేయించుకుంటున్నారు.ఏప్రిల్ తో పోల్చి చూస్తే మే లోనే ఎండలు మండిపోతాయి. ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఉగ్రరూపం దాల్చిన సూర్యుడు మేలో ఇంకెంత భయపెడతాడోననే అనుమానాలున్నాయి. కానీ ఈ ఏడాది వరకు మే నెల కూల్ కూల్ గా వెళ్లిపోతుందని అంచనా వేస్తోంది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). పగటి ఉష్ణోగ్రతలు మే నెలలో సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయని ఐఎండీ వెల్లడిరచింది.ఇదే నెలలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది.ఏప్రిల్ లో ఉన్నంత ఉక్కపోత మేలో ఉండదు, పైగా ఊరట లభిస్తుందని ఐఎండీ చెప్పడం నిజంగా శుభవార్తే.
వాతావరణంలో ఎలాంటి మార్పు లేకుండడంతో రాబోవు ముందు రోజులు ఎండ తీవ్రత పెరిగే అవకాశంఉందని, తగిన జాగ్రత్తలో పాటు,ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు వైద్యులని సంప్రదించాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఎండాకాలం బయట కు వెళ్లేప్పుడు ప్రతి ఒక్కరు గొడుగు తీసుకెళ్లాలి. తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను వినియోగిం చాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. చిన్నపిల్లలను, గర్భిణీ స్త్రీలను, వృద్ధులను ఎండలో బయటకు తీసుకెళ్లకూడదు. చాయ్ కాఫీ ఆల్కహాల్ చక్కెర అధికంగా ఉన్న ద్రవ పదార్థాలను తీసుకోవద్దు. అవి శరీరంలోని నీటిని ఎక్కువగా బయటకు పంపుతాయి. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.శీతల పానియాల వైపు పరుగులు. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలు ఉదయం 12 గంటలకే నిర్మానుష్యంగా మారుతున్నాయి.అయితే ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానియాల దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు.మజ్జిగ, పండ్ల రసాలు, చెరుకురసం,కొబ్బరిబోండాలు తీసుకునేందుకు వ్యాపార దుకాణాల ముందు ప్రజలు వాలిపోతున్నారు.ఇంట్లో ఎండ సెగలనుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఫ్రిజ్లు కొనుగోలు చేస్తున్నారు.
ఎండల తీవ్రతపై ముందుజాగ్తత్తలు
వేసవిలో వడదెటబ్బ నుంచి రక్షించకోవడానికి ప్రతిఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తలనెప్పి, కండరాలు పట్టేయడం, వికారం, కళ్లుతిగడం, వాంతులు చేసుకోవడం లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లు నిర్ధారించు కోవాలని, వడదెబ్బ తగిలినట్లు గుర్తిస్తే నీటిలో ఓఆర్ఎస్ పొడిని కలిపి తాగాలని, అది దొరకని పరిస్థితుల్లో నీటిలో కొంచం ఉప్పు, పంచదార కలుపుకొని తాగాలని వైద్యులు సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో ఎక్కువ సమయం తిరగరాదని, ఇళ్లు, లేదా చల్లనిగాలి వీచే నీడనిచ్చే ప్రాంతాల్లో ఉండాలన్నారు. విధిగా 5 నుంచి 6 లీటర్ల వరకు నీటిని తాగాలని, చిన్న పిల్లలు, వృద్దులు, అనారోగ్యంతో ఉన్నవారు ఎండలో ప్రయాణం చేయకూడదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే గొడుగు పట్టుకొని వెళ్లాలి.ఎవరైనా వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్తే ఆ వ్యక్తికి నీరు తాగించకుండా వీలైనంత త్వరగా హాస్పిటల్ కు తరలించి వైద్యులచే చికిత్స చేయించాలని,వడదెబ్బ నుంచి కోలుకునేవరకు వైద్యుల సలహాల మేరకు నడుచుకోవాలని సూచించారు.
మోటె చిరంజీవి
9949194327
˜





