ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : వినాయక నవరాత్రులను పురస్కరించుకొని కడ్తాల మండలంలోని మై సిగండి గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద ప్రతిష్టించిన గణనాథుడికి మైసిగండి గ్రామ సర్పంచ్ రామావత్ తులసి రామ్ నాయక్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాధుడికి సర్వాంగ సుందరంగా మండపాలను అలంకరించి విద్యుత్ విలువలతో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో భక్తులతో వినాయక మండపాలు కిటకిటలాడుతున్నాయి భక్తులు పూజల కోసం ఆయా మండపాల వద్ద బారులు తీరుతున్నారు. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైసిగండి గ్రామ పూజారి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.



