బ్యాడ్మింటన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించిన ఐఎస్ఎస్వో

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 03 : గౌడియం స్కూల్ ఆతిథ్యమిస్తోన్న ఐఎస్ఎస్వో ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సత్కరించినట్లు నిర్వాహకులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వ్యూహాత్మక గేమ్ ప్లేకు ప్రసిద్ధి చెందిన బ్యాడ్మింటన్ ఈ ఈవెంట్లో హైలైట్గా నిలిచిందన్నారు. భారత బ్యాడ్మింటన్ లో ఒక మహోన్నత వ్యక్తి, పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా, భారత బ్యాడ్మింటన్ జట్టుకు చీఫ్ నేషనల్ కోచ్ గా పుల్లెల గోపీచంద్ మార్గదర్శకత్వంలో ఒలింపిక్ పతక విజేతలను తయారు చేయడమే కాకుండా భారత దేశంలో బ్యాడ్మింటన్ ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గోపీచంద్ గౌడియం స్పోర్టోపియాకు ముఖ్య సలహాదారుగా, గౌడియం స్కూల్ లోని బ్యాడ్మింటన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు మెంటార్ గా కొనసాగుతున్నారని చెప్పారు. ఐఎస్ఎస్వో జాతీయ క్రీడలు కేవలం ఒక క్రీడా కార్యక్రమం మాత్రమే కాదని, అవి క్రీడాస్ఫూర్తి, అంకితభావం, అథ్లెట్లు, మార్గదర్శకుల స్ఫూర్తిదాయకం అన్నారు. గౌడియం స్కూల్లో నిర్వహించే 2023 ఐఎస్ఎస్ఓ జాతీయ క్రీడలు భారత దేశంలో జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్ ప్రపంచానికి శాశ్వత వారసత్వాన్ని మిగల్చడంలో సందేహం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *