- 70 మంది ఐటీ శాఖ సిబ్బందితో దిల్లీలో సోదాలు
- సిబ్బంది ఫోన్లు, కంప్యూటర్లు సీజ్
- సోదాలు కాదు..సర్వే మాత్రమే : ఐటి శాఖ వివరణ
- దేశంలో అనధికార ఎమర్జెన్సీ : కాంగ్రెస్ విమర్శ
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 14 : దిల్లీ, ముంబైలో బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. 70 మంది ఐటీ శాఖ సిబ్బంది దిల్లీ లోని బీబీసీ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. సిబ్బంది ఫోన్లను, కంప్యూటర్లను ఐటీ శాఖ సిబ్బంది సీజ్ చేశారు. సిబ్బందిని బయటకు వెళ్లనీయలేదని ఐటీ శాఖ అధికారులు కోరినట్టు తెలుస్తుంది. పన్ను ఎగవేత ఆరోపణలపై బీబీసీ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. అయితే బీబీసీ కార్యాలయాల్లో సోదాలు చేయడం లేదని, సర్వే మాత్రమే చేస్తునట్టు ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. అకౌంటింగ్ శాఖలోని కంప్యూటర్లలో డేటాను పరిశీలిస్తున్నారు ఐటీ శాఖ సిబ్బంది. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. దేశంలో అనధికార ఎమర్జెన్సీ అమలవుతుందని విమర్శించింది.
వినాశకాలే విపరీతబుద్ది అని అన్నారు కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్. తొలుత మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించిన ప్రభుత్వం ఇప్పుడు ఐటీ సోదాలు చేస్తుందని మండిపడింది. పన్ను ఎగవేతపై విచారణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ మంగళవారం దిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో సర్వేలో భాగంగా కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, భారతీయ శాఖలకు సంబంధించిన పత్రాలను డిపార్ట్మెంట్ పరిశీలిస్తుంది. సర్వేలో సంస్థ వ్యాపార ప్రాంగణాలను మాత్రమే కవర్ చేస్తుంది.
దాని ప్రమోటర్లు లేదా డైరెక్టర్ల నివాసాలు..ఇతర ప్రదేశాలలో దాడులు నిర్వహించదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. మాజీ బీబీసీ ఉద్యోగి ఈటీవీ ఇండియాతో మాట్లాడుతూ..తాను కార్యాలయంలో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని, అయితే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయని..కార్యాలయానికి సీలు వేయబడిందని చెప్పారు. కానీ ఇది నిజంగా దాడినా లేదా శోధననా లేదా వారిని పిలిపించాలా అనేది వారికి ఇప్పటికీ తెలియదు.



