హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : 30 న జరిగే ఎన్నికల్లో దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు దోమ మల్లేష్ మాదిగ విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లేష్ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రకుల పేదల ఉన్నత చదువులకు సంక్షేమ హాస్టల్ భవనాలను నిర్మించి భోజన వసతులు కల్పించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో కొత్తగా హాస్టల్స్‌ను నిర్మించకపోగా ఉన్న హాస్టళ్లను నిర్వీర్యం చేసి చాలీచాలని వసతులతో ప్రైవేట్ బిల్డింగ్‌ల్లో లక్షల రూపాయలు అద్దెలు చెల్లిస్తూ సాంకేతిక కారణాలు చూపించి ప్రభుత్వ బిల్డింగ్‌లను ఖాళీ చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోరా ప్రధాన కార్యదర్శి బొజ్జ శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదుల పరుశు రాములు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మీన పాల్గొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ లను చిత్తుగా ఓడించాలిమాదిగ దండోరా అధ్యక్షులు దోమ మల్లేష్





