కాంగ్రెస్ నమ్మి… మోసపోవద్దు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దని టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గం పాటు మీ కుటుంబ సభ్యులలో ఒకడినైన తనకు భారీ మెజార్టీ అందించి గులాబీ జెండాను తాండూరు గడ్డపై రేపరెప లాడించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండల పరిధిలోని గౌతాపూర్, చెంగోల్, చింతామణి పట్నం, సంకిరెడ్డిపల్లి తదితర గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. 30, 40 సంవత్సరాల నుండి తాండూరు నియోజకవర్గంలో ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ సీనియర్ నాయకుడు కూడా అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి రూ. 1672.49 కోట్ల నిధులను తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి తీసుకువచ్చానన్నారు. తాండూరు మండలంలో అభివృద్ధి పనులకు రూ. 97.77 కోట్లను ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందించి మీ బిడ్డ పైలెట్ రోహిత్ రెడ్డిని గెలిపించాలన్నారు. ముక్కు, ముఖం తెలియని వాళ్ళని గెలిపిస్తే తాండూరు అభివృద్ధి మరో 10 సంవత్సరాలు వెనక్కు వెళుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందన్నారు. అలాంటి కాంగ్రెస్ మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తుందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఇంటోడు ఇంటోడే బయటోడు బయటోడే.
ఇంటోనికి గ్రామం మీద ప్రజల మీద ప్రేమ ఉంటుంది బయటి వ్యక్తికి మన మీద ప్రేమ ఎందుకుం టుందన్నారు. తాండూర్ మండలంలో ఎన్ని ఊళ్ళు ఉంటాయో తెలవదు , గల్లీలు ఎక్కడుంటాయో తెలియదు, ప్రజలు తెలియదు అలాంటి ఒక వ్యక్తి వచ్చి నేను మీ అభ్యర్థిని అంటే ఎలా నమ్ముతామన్నారు. తాను పోయిన ఎలక్షన్లో మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీ ముందుకు వచ్చానన్నారు. నేను మీకు మాట ఇస్తున్న తాండూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానన్నారు. మహిళలకు ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ప్రతి ఆడబిడ్డను సొంత ఆడబిడ్డగా చూసుకుంటున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వమన్నారు. దేశంలో రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వమన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వమన్నారు రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు పాలు కాకూడదనే ఉద్దేశంతో రూ.5 లక్షలను ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు.




