బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తాం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ చేరిన యువత వెల్లడి

తాండూర్, ప్రజాతంత్ర, నవంబర్ 20: బి ఆర్ ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రోజా సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన యువకులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బిఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో నారాయణపూర్ (తాండూర్ మండలం) యువత టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేయడం చూసి పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వారితో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు  గత 30 40 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కేవలం రెండు సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి దక్కుతుందన్నారు. ఎన్నికలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకు తమ వంతు కలిసికట్టుగా భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *