‘‘‌రాజకీయంగా చూస్తే, గడచిపోతున్న సంవత్సరం అంతా మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి పెద్ద విజయాలనే అందించింది. అయితే చివరలో హిమాచల్‌, ‌దిల్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇది ఓ హెచ్చరికగా ఆయన తీసుకుంటే మంచిది. ఆయా రాష్టాల్ల్రో సాధించిన విజయాలే 2024లో జరిగే ఎన్నికల్లో బిజెపి తిరిగి జాతీయ స్థాయిలో అధికారం చేజిక్కించుకుంటుందన్న ధీమాలో బిజెపి నేతలు ఉన్నారు. అందుకే  బిజెపి తన పూర్తి దృష్టిని ఇప్పుడు దక్షిణాది రాష్టాల్రపై కేంద్రీకరించింది.’’

ప్రశ్నించే గొంతులను వినిపించుకోకపోతే… ప్రజాస్వామ్య ఉనికే ప్రశ్నార్థకమవుతుందని పాలకవర్గాలు  గ్రహించలేక పోతున్నాయి.ఈ యేడది పరిస్థితులు,పాలకు తీరును గమనిస్తే ఇది స్పష్టంగా గమనించవచ్చు. కేంద్రంలోని బిజెపి కావచ్చు …లేదా ఉభయతెలుగు రాష్టాల్ల్రోని పాలకులు కావచ్చు..దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల పాలకులు కావచ్చు..పాలకులుగా ప్రజల ఆందోళనలు అర్థంచేసుకోలేక పోతున్నాయి. కొరోనా  తీవ్రత కారణంగా దేశానికి  జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. స్థూల దేశీయోత్పత్తి జిడిపి బాగా క్షీణించింది. కొరోనా ను సాకుగా చూపి దేశంలోని కార్పొరేట్లు… వ్యాపారులు, భూస్వామ్యులు, బడా విదేశీ పెట్టుబడి దారులు బలపడ్డారు. అంతిమంగా సామాన్యులు బాగా బలహీనపడ్డారు. వీటిన ఇచక్కదిద్దే ప్రయత్నాలు జరగడం లేదు. పాలకు ఈ సమస్యలు తమ ఎజెండాలో లేవన్న స్థిరాభిప్రాయంలో ఉన్నారు. ఇకపోతే మోదీని  వ్యతిరేకించే శక్తులు ఏకం కావడం ఇప్పట్లో సాధంయ కాకపోవచ్చు. రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడోయాత్ర తక్షణ రాజకీయ ప్రయోజనాలు ఇవ్వలేకపోవచ్చు.

కాని ఒక రకంగా ప్రత్యామ్నాయ ఆలోచనా విధానంపై చర్చకు అవకావం ఇచ్చింది.  ప్రజాస్వామ్యంలో ఎక్కడో ఒకచోట ప్రశ్నించే తత్వం రావాలి. కేంద్రంలోని బిజెపిని ఢీకొనేందుకు వివిధ రాష్టాల్ల్రో ప్రత్యామ్నాయ శక్తులు సమాయత్తమవుతున్నాయి. అయితే పాలనలో ఉన్న వివిధ రాష్టాల్ల్రోని ప్రాంతీయపార్టీలు తమ రాష్టాల్ల్రో నిరంకుశంగా వ్యవహరిస్తూ.. కేవలం మోదీ•వైపు వేలెత్తి చూపుతున్నాయి. దీనిని కూడా ప్రజలు స్వాగతించరని గుర్తించాలి. నిజానికి ప్రభుత్వాలపైనే ప్రజలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి.. బిహార్‌లో బిజెపి ప్రభుత్వాన్ని వదిలించుకుని మహాకూటమి సర్కార్‌ ఏర్పాటు చేసిన నితీశ్‌ ‌కుమార్‌ ‌వ్యవహారశైలి కూడా పెద్దగా ఆశాజనకంగా లేదు. దిల్లీలో  బిజెపి ఉధృతిని అడ్డుకుని పంజాబ్‌,‌దిల్లీ ల్లో పాగా వేసిన అరవింద్‌ ‌కేజీవ్రాల్‌  ‌మరోవైపు సవాల్‌ ‌చేస్తున్నారు. తన ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చి కేసీఆర్‌ ‌కూడా బిజెపిపై సవాళ్లు విసరుతు న్నారు. రాజకీయంగా చూస్తే, గడచిపోతున్న సంవత్సరం అంతా మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి పెద్ద విజయాలనే అందించింది. అయితే చివరలో హిమాచల్‌, ‌దిల్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది.

ఇది ఓ హెచ్చరికగా ఆయన తీసుకుంటే మంచిది. ఆయా రాష్టాల్ల్రో సాధించిన విజయాలే 2024లో జరిగే ఎన్నికల్లో బిజెపి తిరిగి జాతీయ స్థాయిలో అధికారం చేజిక్కించుకుంటుందన్న ధీమాలో బిజెపి నేతలు ఉన్నారు. అందుకే  బిజెపి తన పూర్తి దృష్టిని ఇప్పుడు దక్షిణాది రాష్టాల్రపై కేంద్రీకరించింది.2023లో కూడా పది రాష్టాల్లో్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌, ‌కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ ‌రాష్టాల్ల్రో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్టాల్లో్ర కాంగ్రెస్‌ ‌నుంచి, తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ‌నుంచి అధికారాన్ని కైవసం  చేసుకునేందుకు బిజెపి ఉవ్విళ్లూరుతోంది.
గత 8 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు నరేంద్రమోదీ సారథ్యంలోని బిజెపితో హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయినా పెద్దగా విజయం సాధించడం లేదు. 2024 నాటికి కాంగ్రెస్‌ ‌జాతీయ స్థాయిలో బిజెపితో తలపడేందుకు సన్నద్ధం కాగలుగుతుందని  తహతహలాడుతోంది. రాహుల్‌ ‌జోడోయాత్రతో అంతా సానుకూలం అయ్యిందన్న భరోసాలో ఉంది.ఈ 8 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ ‌పది రాష్టాల్లో్ర అధికారం కోల్పోయింది. కేవలం రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోనే అధికారంలో ఉన్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక కావడంతో ఒక రకంగా నాయకత్వ సమస్యపై చర్చ లేకుండా చేసింది. మరో వైపు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ రాహుల్‌ ‌గాంధీ తన భారత్‌ ‌జోడో యాత్రతో పార్టీకి అసలైన నేత తానే అని చెప్పకనేచెబుతున్నారు. దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, ఎన్జీవోలు ఈ యాత్రలో పాల్గొనడంతో పాటు మద్దతుతెలపడంతో నిజంగానే రాహుల్‌లో ఉత్సాహంరెట్టించింది. గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ బిజెపి ఎందుకో సామాన్యులను నేటికీ దరిచేర్చుకోవడం లేదు. ప్రధాన సమస్యలపై స్పందించడం లేదు. ఆర్థిక సమస్యలను,ధరల పెరుగుదలను పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు దూకుడుగా ఉన్న మమతా బెనర్జీ ఇటీవలి ఆ రాష్ట్రపరిణమాల నేపథ్యంలో మౌనం పాటిస్తున్నారు.

నితీశ్‌ ‌కుమార్‌, ‌కేసీఆర్‌, ‌శరద్‌ ‌పవార్‌, అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌తదితరులకు బిజెపిని ఢీకొనడం మినహా వేరే మార్గం లేదు. బిహార్‌, ‌మహారాష్ట్రలో బిజెపిని ఢీకొనాలంటే సైద్దాంతిక విభేదాలను పక్కన పెట్టే కూటమి లేకుండా సాధ్యపడదని ప్రతిపక్షాలు గ్రహించడం లేదు.  కేసిఆర్‌ ‌భారత రాష్ట్ర సమితి శంఖారావం అయితే పూరించారు గానీ దానికి రథాన్ని సిద్దం చేయలేదు. 2024 ఎన్నికలకు జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక పక్షాలు ఏ రూపంలో వస్తాయన్నదానికి స్పష్టత లేదు. సిబిఐ,ఈడీలతో పాటు అనేక వ్యవస్థల్నీ బిజెపి పెద్ద ఎత్తున ఉపయోగిం చుకుని ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేస్తోందన్న ఆరోపణలు పెరిగాయి.  తెలంగాణకు సంబంధించి దిల్లీ  మద్యం కుంభకోణం, ఎమ్మెల్యేల కొనుగోలుపై సిబిఐ, ఈడీల పంజా మరింత విస్తృతం కావడంతో ఈ కేసులు ఎటు తిరుగుతాయో చెప్పలేం. బిహార్‌లో లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులపై పాత అవినీతి కేసులు మళ్లీ తెరిచారు. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర నేతలపైనే 95 శాతం పైగా సిబిఐ కేసులున్నాయి. ఇకపోతే ఏడాది చివరలో మరోమారు కొరోనా కొత్త వేరియంట్‌ ‌భయపెడుతోంది. అన్ని దేశాలతో పాటు భారత్‌ ‌కూడా కొరోనా  తీవ్ర ప్రభావానికి గురయ్యింది. ఇప్పటికీ దీనిపీడ విరగడ అయ్యిందన్న ధీమా రావడంలేదు. ఏడాదిలో సుమారు సగం రోజులు భయాలతోనే గడిచిపోయాయి.  ఈ కారణంగా 2022 సంవత్సం ప్రజలకు తీరని వేదన మిగిల్చింది. ఓ రకంగా వరుసగా మూడేళ్లు ప్రజలకు తీరని నష్టాన్ని కలిగించింది. ఇదోపక్క ఇలా ఉండగానే అనేక ఆందోళనలు కూడా దేశాన్ని అతలాకుతలం చేశాయి. వీటిని అధిగమించేలా పాలకుల తీరులో మార్పు వస్తే తప్ప ప్రజలకు ఉపశమనం కలగదు.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *