హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 5 : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీజేపీని ఎవరూ వీడరని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో బీజేపీ మధ్య అవగాహన ఉందనేది ప్రచారం మాత్రమే అని ఈటల వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ. జాకీలు పెట్టి లేపినా తెలంగాణలో కాంగ్రెస్ లేవదని విమర్శించారు. సీఎం కేసీఆర్ అవినీతి పాలన పట్ల బీజేపీ వైఖరిలో మార్పు లేదని, ఈ నెల 8న వరంగల్ సిటీలో ప్రధానమంత్రి బహిరంగ సభను విజయవంతం చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.



