కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 12 : మహేశ్వరం నియోజకవర్గానికి అలుపెరగని బాటసారిలా కృషి చేస్తున్న సబితమ్మ వెంటే మేము అంటు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో వేలాది కోట్లతో మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి చేసిన మంత్రి అంటూ కందుకూరు మండలం సార్లరావుల పల్లి గ్రామ సర్పంచ్ రజిత ప్రవీణ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు.తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో కందుకూరు మండలం సార్లరావులపల్లికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 50 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారందరికీ గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు చేరాయన్నారు.దేశానికే ఆదర్శంగా నిలిచేలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వంను ఆశీర్వదించి,హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలని కోరారు.మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థిగా కెసీఆర్ ప్రకటించారని,ప్రజలు తనను ఆశీర్వదించాలని,మరింత బాధ్యతగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఉపాధ్యక్షులు లక్ష్మీ నరసింహ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి,డైరెక్టర్ కాట్రోత్ దేవిలాల్ నాయక్,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కృష్ణా రాంభూపాల్ రెడ్డి, అన్నోజిగూడ సర్పంచ్ కాకి దశరథ,సార్ల రావులపల్లి ఉపసర్పంచ్ శ్రీనివాస్,మాజీ సర్పంచ్ గోవర్ధన్ నాయక్,సీనియర్ నాయకులు బాలు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు…మహేశ్వరం గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం




