బిఆర్ఎస్ పార్టీతోనే సమగ్ర అభివృద్ధి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 14: బిఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం పిఎన్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ది కాలంలో ప్రతి గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచామని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో మౌలిక వసతులు కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.ఆచరణకు నోచుకోని హామీలను ఒప్పిస్తూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కాంగ్రెస్, బిజెపి పార్టీలను తరిమికొట్టాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ శివకుమార్ గౌడ్,  వార్డు సభ్యులు బండి హరి శంకర్, నాయకులు రాఘవేందర్ రెడ్డి, శివారెడ్డి, నరసింహారెడ్డి, మాణిక్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు మురళి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *