తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరారు.బుధవారం పట్టణంలోని 5వ వార్డు లొటిఆర్ఎస్ పార్టీ సుమారు 200 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తుక్కుగూడ బహిరంగ సభలో శ్రీమతి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని అన్నారు. పక్కన ఉన్న రాష్ట్రం కర్ణాటకలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన నాలుగు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఇదేవిధంగా తెలంగాణలో తుక్కుగూడ బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలంగాణ సెంటిమెంట్ పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హమీని కూడా నెరవేర్చాలేదని , మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కేవలం తన కుటుంబం లోని నలుగురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఏ ఒక కుటుంబానికి గాని ఏ ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు రాలేవని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. మళ్లీ ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు అక్రమ కేసులకు భయపడి లేదని అన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్ మైనార్టీ నాయకులు మహమ్మద్ అమేర్ అబ్దుల్లా కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ కుమార్ రాజు గౌడ్ శ్రీనివాస్ సమ్మద్ జలాల్ ఉద్యమకారుడు నాగేందర్ బషరథ్ అలీ ఎం.డి బషీర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు





