బిఆర్ఎస్ గెలుపుకై ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 13: అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించి పట్టం కట్టాలని, అదేవిధంగా పుట్టిన బిడ్డనుండి ముసలితనం వరకు ప్రతి కుటుంబంలో ఎవరికైనా కెసిఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకం ఏదో ఒక రూపేనా వారింటికి చేరుతుందని, కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమాన్ని గుర్తించి కారు గుర్తుపై ఓటు వేయాలని ఎల్.బి.నగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అభ్యర్థించారు. ఆదివారం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ కటికరెడ్డి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో బి.యన్.రెడ్డి. నగర్ డివిజన్ పరిధిలోని గాంధీ నగర్, గాంధీ నగర్ సౌత్, సాగర్ కాంప్లెక్స్ ఫేస్ 1, సాగర్ కాంప్లెక్స్‌ ఫేస్ 2, శ్రీపురం కాలనీ సౌత్, శ్రీపురం నార్త్, గౌతమి నగర్ కాలనీల నందు కాలనీవాసుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్.బి.నగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ నియోజకవర్గన్నీ అభివృద్ధి చేసిన ఘనత మీదే అని తెలిపారు. అలాగే ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ సమస్యలు పరిష్కారం చేసి మా జీవితాల్లో వెలుగులు నింపడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, కుంట్లూరు వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, అనిల్ చౌదరి, మాధవరం నర్సింహారావు, సామ బుచ్చిరెడ్డి, గడ్డం మల్లేష్ గౌడ్, సుమన్ గౌడ్, శివశంకర్, పొగుల రాంబాబు, కాజా శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళా నాయకురాలు, అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *