బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌రాజయ్యపై చార్జిషీట్‌ ‌విడుదల చేసిన కాంగ్రెస్‌

స్టేషన్‌ ‌ఘనపూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : పామునూర్‌ ‌లంచ్‌ ‌పాయింట్‌ ‌వద్ద కాంగ్రెస్‌ ‌నేతలు జంగా రాఘవరెడ్డి, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, సింగపురం ఇందిర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ‌ఘనపూర్‌ ఎమ్మెల్యే రాజయ్యపై చార్జీషీటును విడుదల చేశారు.
అభివృద్ధి శూన్యం :  జంగా రాఘవరెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు
స్టేషన్‌ ‌ఘనపూర్‌ ‌నియోజకవర్గంలో రాజయ్య, శ్రీహరి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా చేసిన అభివృద్ధి శూన్యం. కడియం, రాజయ్య ఇద్దరూ తొడుదొంగలే. నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఎందుకు తీసుకురాలేదు. 100 పడకల హాస్పిటల్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగానే చెన్నూరు రిజర్వాయర్‌ ‌తీసుకొచ్చింది. రాజయ్య బాగోతం అందరికీ తెలిసిందే. దళితబంధు రాకముందే బీఆర్‌ఎస్‌ ‌నేతలు 3 లక్షలు లంచాలు వసూలు చేస్తున్నారు. దళితులపై బీఆరెస్‌ ‌నేతలకు చిత్తశుద్ధి లేదు. ఎర్రబెల్లీ..నీ అవినీతిని నిరూపించడానికి రేవంత్‌ ‌దాకా అవసరం లేదు. జనగామ జిల్లాలో ఎక్కడ కూర్చుందామో చెప్పు. నీ అవినీతిని ఆధారాలతో సహా నేను నిరూపిస్తా. ఏ వ్యాపారం చేసి దయాకర్‌ ‌రావు ఇన్ని వందల కోట్లు ఎలా సంపాదించారు? అని రాఘవ రెడ్డి సవాల్‌ ‌విసిరారు.
ఎమ్మెల్యే అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ చార్జిషీట్‌ : ‌సింగపురం ఇందిర
ఎమ్మెల్యే అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకె కాంగ్రెస్‌ ఈ ‌చార్జి షీట్‌ ‌ను విడుదల చేసాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య చేసిన అభివృద్ధి శూన్యం. వైద్య శాఖ మంత్రిగా పనిచేసి.. నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్‌ ‌తీసుకురాలేకపోయారు. మహిళలు అంటే ఎమ్మెల్యేకు అసలు గౌరవం లేదు. రాజయ్యతో ఫోటో దిగలన్నా మహిళలు భయపడుతున్నారని ఇందిర ఆరోపించారు.
రాజయ్య, శ్రీహరి ఇద్దరూ అసమర్థులే : సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎంపీ
విద్యావంతుడు శ్రీహరికి విద్యాశాఖ ఇచ్చినా..వైద్య వృత్తిలో అనుభవం ఉన్న ఎమ్మెల్యే రాజయ్యకు వైద్య శాఖ అప్పగించినా… ఇద్దరూ అసమర్థులని నిరూపించుకున్నారు. ఏడేళ్ల క్రితం మంజూరు చేసిన ఘనపూర్‌ ‌ఫ్లై ఓవర్‌ను ఎందుకు మొదలు పెట్టలేదు? అవినీతి, చిల్లర వ్యవహారాలకు పరాకాష్ట ఎమ్మెల్యే రాజయ్యఅని కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపి రాజయ్య ఆరోపించారు.
రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం : మల్లు రవి, టీపీసీసీ సీనియర్‌ ‌వైస్‌ ‌ప్రెసిడెంట్‌
‌కేసీఆర్‌ ‌రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని నిర్వీర్యం చేశారు. సమస్య వొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సర్పంచులకు రావాల్సిన నిధులను వారికి తెలియకుండానే ప్రభుత్వం తీసుకుంటుంది. సమస్యలు పరిష్కారం చేసే సత్తా కాంగ్రెస్‌ ‌పార్టీకి, రేవంత్‌ ‌రెడ్డికే ఉంది. అందుకే రేవంత్‌ ‌రెడ్డి యాత్ర ఫర్‌ ‌ఛేంజ్‌ ‌పాదయాత్రకు కూడా విశేష స్పందన లభిస్తుంది. అద్భుతంతగా ఉండే కట్టడాల వల్ల ప్రజలకు మేలు జరగదు. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయి. శివరాత్రి సందర్భంగా రేపు, ఎల్లుండి యాత్రకు విరామం ఉంటుంది. అనంతరం మళ్లీ వరంగల్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలో రేవంత్‌ ‌యాత్ర కొనసాగుతుందని మల్లు రవి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *