బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకై ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి  గుర్క జైపాల్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో  బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ పదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. జైపాల్ యాదవ్కు అమూల్యమైన ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈకార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు. శ్రీకాంత్ యాదవ్, నాయకులు నరేందర్ గౌడ్, విజయ్ కుమార్, శ్రీరామ్, సుధాకర్, రమేష్ , పాపయ్య, విజయ్, లింగం, సాయి, కృష్ణయ్య, జగన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *