ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే కెసిఆర్ భరోసా పథకాలు అమలవుతాయని కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి అసెంబ్లీకి పంపాలని ఓటర్లను అభ్యర్థించారు. కల్వకుర్తిలో అభివృద్ధిని చూసి పట్టం కట్టాలన్నారు. ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటానని ఆదరించి ఆశీర్వదించాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు రాగానే రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు తెలిపారు రూ.2 వేలు ఉన్న ఆసరా పెన్షన్ రూ. 5వేలకు రూ.4వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ రూ. 6వేలకు పెంచబోతున్నట్లు తెలిపారు. ప్రతినెల సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.3వేలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ భరోసా





