బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: సిద్ధిపేట జిల్లా జగదేవపూర్: మండలం లోని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన చెక్కల నర్సింలు, భీమరి
 అశోక్ కు చెందిన పెంకుటి ఇండ్లు గత వారం రోజుల నుండి  ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పెంకుటి ఇండ్లు కూలిపోవడంతో ఎటు తోచని పరిస్థితి లో ఉన్న కుటుంబ సభ్యులు అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులు ఎవరూ పట్టించుకోవడం తో  ఈ విషయం తెలుసుకున్న మండల బిజెవైఎం ప్రధాన కార్యదర్శి భీమరి  గణేష్ ముదిరాజ్  బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు.ఈ విషయంను  తెలుసుకున్నవెంటనే స్పందించిన బిజెపి జాతీయ నాయకుడు ఏపీ జితేందర్ రెడ్డి, ముగా జయశ్రీ,, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఏర్పుల వెంకట రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు నందన్ గౌడ్, పేర్ల శ్రీనివాస్  బాధిత కుటుంబాలను పరామర్శించి ఆ కుటుంబలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …నష్ట పోయిన బాధిత  కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నేతలు  పేర్ల శ్రీనివాస్,  గర్నెపల్లి కృష్ణమూర్తి, గుర్రం శ్రీధర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *