మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : నాంపల్లిలోని బజార్‌ఘాట్ ఏరియాలో ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై సీంఎ కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సిఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. సహాయ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు.
బాజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై సిఎం కెసిఆర్ దిగ్బ్రాంతి





