ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: భారత మాత ముద్దు బిడ్డగా, తెలుగు తొలి బహుజన చక్రవర్తిగా 21 కోటలు నిర్మించి, 30 ఏండ్లు పాలించి, ఏడున్నర నెలల పాటు గోల్కొండను ఏలిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని మీర్పెట్ హెచ్ బి కాలనీ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ స్పష్టం చేశారు. శుక్రవారం బహుజనుల విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మీర్పెట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని ఫస్ట్ ఫేస్ చౌరస్తా ప్రధాన కూడలిలో గల ఆయన విగ్రహానికి కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ భారత మాత ముద్దు బిడ్డగా, తెలుగు తొలి బహుజన చక్రవర్తిగా 21 కోటలు నిర్మించి, 30 ఏండ్లు పాలించి, ఏడున్నర నెలల పాటు గోల్కొండను ఏలిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిని ప్రతి ఏటా అధికారిక కార్యక్రమాలుగా ప్రభుత్వం నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌండిన్య సంక్షేమ సంఘం నాయకులు ముత్యం వెంకన్న గౌడ్, మల్లేష్ గౌడ్, సర్వన్న గౌడ్, సురేష్ గౌడ్, సాయిలు గౌడ్, బాలయ్య గౌడ్, ఎట్టయ్య గౌడ్, కృష్ణ గౌడ్, చెక్కిళ్ళ చంద్ర శేఖర్ గౌడ్, నవీన్ గౌడ్, యాదగిరి గౌడ్ , బీఆర్ఎస్ నాయకులు బాల్ నరసింహ, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.



