ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28: విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే అని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసన సభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిరావుపూలే 133వ వర్దంతి సందర్భంగా ఎల్.బి.నగర్ నందు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి నాంది పలికిన గొప్ప నాయకుడు అని అన్నారు. 150 సంవత్సరాలా క్రితం స్త్రీ విద్య కోసం ఆలోచించిన అపర మేధావి అని అన్నారు. కుల నిర్ములన కోసం ఎన్నో పోరాటాలు చేసారని, బడుగు బలహీన వర్గాలకు ఆశాదీపం అని అన్నారు.19వ శతబ్దంలో మన దేశంలో సామజిక అసమానతల మీద పోరు చేసిన వ్యక్తి అని అన్నారు. ఆధునిక యుగంలో కులాన్ని వ్యతిరేకించిన ప్రబోధకుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు.
బహుజనలకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి




