పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 7: టిఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి తరపున బండలగూడలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ ఇంటింటి కి తిరిగి కారు గుర్తు కు ఓటు వెయ్యాలని ప్రజలను అభ్యర్ధించారు. బండలగూడ లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గత తోమిదేండ్లలో యాభై కోట్ల రూపాయల అభివృద్ధిని చేశారని, గతంలో బండలగూడ ప్రాంతమంతా కాలుష్యమయమై త్రాగు నీరు లేక ప్రజలంతా తీవ్ర ఇబ్బందుల పాలైనారు.2014 తెలంగాణ
రాష్టము ఏర్పడి కెసిఆర్ ముఖ్య మంత్రిగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బండలగూడ ప్రజలకు ఇంటింటి కి త్రాగునీరు అందిస్తున్న మమన్నారు.ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారముతో బండలగూడ ప్రజలకు, మౌలిక సదుపాయాలు అందినాయని, అభివృద్ది జరిగిందని, నాణ్యమైన విద్యుత్తు ను వినియోగించుకుంటున్నారని యాదగిరియాదవ్ అన్నారు. బండలగూడ ప్రజలంతా నవంబర్ 30 వ తేదీన నా జరుగు ఎన్నికలలో టిఆర్ఎస్ కారు గుర్తు కు ఓటు వేసీ అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గోపాల్, చంద్రశేఖర్, జీతయ్య పాల్గొన్నారు.




