బంగాళాఖాతంలో భూ ప్రకంపణలు

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌25:  ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 8.35 గంటలకు ఉత్తరకాశీలో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ ‌స్కేల్‌పై 3.0గా  నమోదయింది. భూ అంతర్భాగంలో 5 కిలోటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌సీస్మోలజి తెలిపింది.

ఉదయం 9.38 గంటలకు బంగాళాఖాతంలో  4.3 తీవ్రతతో భూమి కంపించింది. 37 కిలోటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని ఎన్‌సీఎస్‌ ‌వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున 2.31 గంటలకు అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని ఎన్‌సీఎస్‌ ‌తెలిపింది. భూ అంతర్భాగంలో 35 కిలోటర్లలో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప కేంద్రం అండమాన్‌ ‌సముద్రంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *