బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

  • ఎపిలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు  
  • తుఫాన్‌ ‌హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ ‌వెల్లడి

విశాఖపట్నం, జూలై 20 : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని తుఫాన్‌ ‌హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ ‌సునంద తెలిపారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కదులుతోందన్నారు. దీన్ని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 10 సెంటీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు. ఈ పరిస్థితి మరో ఐదు రోజులపాటు కొనసాగుతుందని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎల్లో వార్నింగ్‌ ‌ప్రకటించామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు అంటూ తుఫాన్ల హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ ‌సునంద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. ఎగువ రాష్టాల్లో్ర భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది. దీంతో ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది.

ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు సహయక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఏలూరుకు రెండు ఎస్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు చేరుకున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేశారు. అత్యవసర సహయం కోసం 24 గంటలు 1070, 18004250101 ఈ స్టేట్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నంబర్లు అందుబాటులో ఉంటాయి. జిల్లాల్లో మండల స్థాయిలో కూడా అధికారులు కంట్రోల్‌ ‌రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. బోట్లు, మోటర్‌ ‌బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌డా.బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *