ఫోన్‌ట్యాపింగ్‌లో కెటిఆర్‌ చిప్పకూడా తినాల్సిందే

సిగ్గులేకుండా ట్యాప్‌ చేశామని చెప్పడం అహంకారమే
వందరోజుల పాలనలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం
ఉద్యోగులకు ఠంచన్‌గా జీతాలు ఇస్తున్నాం
వాల్మీకి బోయల సమస్యలు పరిష్కరిస్తాం
గాంధీభవన్‌ల్లో మీడియాతో సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి29:  ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహ రంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఫోన్‌లు విన్నామని కేటీఆర్‌  అంటున్నారని, అలా చేసి ఉంటే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వొస్తుందని హెచ్చరించారు. గతంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందని.. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేసినా అధికారులు ఎవరూ పట్టించు కోలేదన్నారు. పొరపాట్లు చేయ్యొద్దని గతంలో చెప్పినా అధికారులు వినిపించుకోకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారన్నారు. తప్పులు చేసినందుకే కొందరు అధికారులు జైలుకు వెళ్లారన్నారు. కేటీఆర్‌ బరితెగించి మాట్లాడుతున్నారని, ఇప్పటి కైనా అహంకారం తగ్గించుకో వాలన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్‌ కాల్స్‌ను ట్యాప్‌ చేయాల్సిన అవసరం ఏమిటన్నారు. ఎవరైనా ఇతర కుటుంబ సభ్యుల కాల్స్‌ వింటారా అని రేవంత్‌ ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోందన్నారు. గాంధీభవన్‌లో ఆయన డియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ వందరోజుల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తాము అమలు చేసిన పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు.

దిల్లీలో ఇతర రాష్ట్రాల నేతలను కలిసినప్పుడు తెలంగాణ గురించి చర్చించుకుంటున్నారన్నారు. వంద రోజులపాటు పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టి సారించామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు. మొదటి నెల 4వ తేదీన, రెండో నెల ఒకటో తేదీన జీతాలు ఇచ్చామన్నారు. ప్రజా సమస్యలపై వొచ్చిన వారందరినీ కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తన ఇంటికి వచ్చి కలుస్తున్న ప్రజల సమస్యలు విని.. పరిష్కరిస్తు న్నామన్నారు. గత ప్రభుత్వం వోట్లు వేసిన ప్రజలను బయట పెట్టిందని ఆరోపించారు.

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ను ఓడిరచి రేవంత్‌ రెడ్డిని బలహీనపర్చే కుట్ర జరుగుతోందని రేవంత్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయన్నారు. పదేళ్లుగా మోదీ ప్రధానిగా ఉండి మహబూబ్‌ నగర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకుని మహబూబ్‌ నగర్‌ లో బీజేపీ నేతలు వోట్లు అడుగుతున్నారన్నారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వాల్మీకి బోయల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పిస్తామని హా ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎలాంటి హా ఇవ్వడం లేదన్నారు. వీరంతా మంత్రి పొన్నంతో కూర్చుని సమస్యలు చర్చించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *