ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను సోమవారం విడుదల చేశారు. ముందుగా వాటిని స్వామి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధానాలయం పునఃప్రారంభం తర్వాత మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు కావడంతో.. ఘనంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 21న ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవచనం, విష్వక్సేన పూజలతో బ్రహ్మోత్సవాలు మొదలై మార్చి 3న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవ పూజలతో ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, యథావిధిగా నరసింహుడి ఆలయంలో సోమవారం నిత్య పూజలు జరిగాయి. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఒక్క రోజే ఆలయానికి రూ.24,97,159 ఆదాయం వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *