- ఎవరికి వారమే బాధితులమన్నట్లు బిజెపి, బిఆర్ఎస్ పార్టీల తీరు
- కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చేరిక నుంచే విచారణ సాగాలి
- ఈ విషయంలో త్వరలో సిబిఐకి ఫిర్యాదు
- వి•డియాతో చిట్‌చాట్‌లో పిసిసి చీఫ్ రేంవత్ రెడ్డి
- గాంధీభవన్‌లో ఘనంగా కాంగ్రెస్ అవిర్భావ దినోత్సవం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ఫామ్ హౌస్ కేసు విచారణ సరైన పద్దతిలో జరగడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కేసులో బీఆర్ఎస్, బీజేపీలు పార్టీలు రెండు బాధితులే అయినప్పుడు దోషి ఎవరని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ కేసులో కాంగ్రెస్ ఇంప్లీడ్ పిటిషన్ వేయాలా వద్దా అన్న అంశంపై చర్చ జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారేనని అన్నారు. పార్టీ మారిన వారికి బీఆర్ఎస్లో మంచి పదవులు ఇచ్చారని.. అది కూడా అవినీతి కిందకే వస్తుందని అన్నారు. 2018 నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు.ఈ అంశంపై త్వరలోనే సీబీఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వి•డియాతో చిట్ చాట్ సందర్భంగా ఫాం హౌస్ కేసుపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. నేరం జరిగిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తామే విచారణ జరుపుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు నేరమే జరగలేదంటున్న బీజేపీ సీబీఐ విచారణ కోరడాన్ని రేవంత్ తప్పుబట్టారు. సిట్ విచారణకు బీజేపీ, సీబీఐ విచారణకు బీఆర్ఎస్ ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు.
పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు బాధితులుగా చూపిస్తున్నారని.. మరి ఇందులో దోషి ఎవరు అని ప్రశ్నించారు. విచారణ ఒకరిని బాధితుని కింద..మరొకరిని నేరగాని కింద జరుగుతుందన్నారు. నేరం జరిగింది.. కానీ విచారణ తామే చేస్తాం అనడం ద్వారా టీఆర్ఎస్ లోపం బయటపడిందని వ్యాఖ్యలు చేశారు. నేరమే జరగలేదని అంటూనే సీబీఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడుతుందని తెలిపారు. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్ విచారణ అనగానే టీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. రాజకీయ అవసరాలకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కాంగ్రెస్ ఇంప్లీడ్ పీటీషన్ వేయాలా వద్దా అనే దానిపై చర్చ జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారని తెలిపారు. పార్టీ మారిన వారికి టీఆర్ఎస్లో మంచి పదవులు ఇచ్చారని..ఇది కూడా కరప్షన్ కిందే వస్తుందన్నారు. అందుకే కొనుగోలు కేసు.. ఇన్ కంప్లీట్ కేసు అని చెప్పుకొచ్చారు.
కాబట్టి 2018 నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి విచారణ జరగాలని సీబీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ ఆత్మనే సిద్ధాంతంగా రచించుకొని ఆచరిస్తున్న పార్టీ ఏదైన ఉంటే అది కాంగ్రెస్ పార్టీయే అని తెలిపారు. మహాత్మగాంధీ ఇచ్చిన స్పూర్తిని కాంగ్రెస్ శ్రేణులు కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ పాలనలో సమూలమార్పులు తీసుకొచ్చారని, మహిళా రిజర్వేషన్ బిల్లును నాడు బిజెపి అడ్డుకుందని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉందంటే అది కాంగ్రెస్ నిర్ణయమే అని వివరించారు.
దేశ ప్రజలపై బ్రిటిష్ విధానాలను రుద్దాలని బిజెపి ప్రయత్నిస్తుందని, రాహుల్ పాదయాత్ర భయంతోనే మోడీ కోవిడ్ రూల్స్ తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్టాన్రికి రావాల్సిన వాటి పై కేంద్రాన్ని కెసిఆర్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రకు కదలిరావాలని, వ్యక్తిగత సమస్యలపై కాకుండా ప్రజా సమస్యల పై పోరాడేందుకు పార్టీ శ్రేణులు ముందుకు రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, సంభాని చంద్రశేఖర్, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణు గోపాల్, సేవాదల్ చీఫ్ ప్రసాద్, గడ్డం వినోద్, రామచంద్రారెడ్డి, వినోద్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సంగిశెట్టి జగదీష్, రోహిన్ రెడ్డి, సవి•ర్ ఉల్లా, అనుబంధ సంఘాల ఛైర్మన్లు మెట్టు సాయి, నూతి శ్రీకాంత్, సునీతా రావ్ తదితరులు హాజరయ్యారు.



