‌ప్రేమ వ్యవహారంతో దారుణం

యువకుడిని నరికి చంపిన బంధువులు
న్యూ దిల్లీ, జూలై 18 : దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని యువతి బంధువులు  నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని జాఫ్రాబాద్లో సోమవారం చోటు చేసుకుంది. సల్మాన్‌ అనే 25 ఏళ్ల యువకుడికి రెండేళ్ల క్రితం ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అయితే వీరి మధ్య ఉన్న బంధాన్ని యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అయినా వారు అవేవీ పట్టించుకోలేదు. వారి బంధాన్ని కొనసాగించారు. ఇది జీర్ణించుకోలేని యువతి కుటుంబ సభ్యులు యువకుడిని హతమార్చాలని పథకం రచించారు.

ఈ క్రమంలో సోమవారం సల్మాన్‌ ‌తన స్నేహితులతో కలిసి జాఫ్రాబాద్‌ ‌ప్రాంతంలో వెళ్తుండగా అతనిపై యువతి తండ్రి మంజూర్‌, ‌సోదరులు మోషిన్‌, ‌మరో యువకుడు దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సల్మాన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌ ‌కు గురైన సల్మాన్‌ ‌స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *