‌ప్రేం సాగర్‌ ‌కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి :కాంగ్రెస్‌

‌హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 31: నగరం జలమయమైన సమయంలో హన్మకొండ వేయి స్థంబాల గుడి వెనకాల నివసిస్తున్న వి.ప్రేం సాగర్‌ ఇటీవల కరంటు తీగ తగిలి కరంట్‌ ‌షాక్‌తో మృతి చెందిగా వారి కుటుం బాన్ని పిసిసి మాజీ అద్యక్షుడు, రాజ్యసభ మాజీ ఎంపి హనుమంత రావు, హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌ అద్యక్షుడు నాయిని రాజేందర్‌ ‌రెడ్డి లు పరామ ర్శించారు.ఈసందర్భంగా బాధిత కుటుం బానికి ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. అనం తరం వారు మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ  డిపార్టు మెంటు నిర్లక్ష్యంతో చనిపోయిన  ప్రేం సాగర్‌ ‌కుటుంబానికి ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం అందించాలన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుం దని వారికి మనో ధైర్యాన్ని కల్పిస్తూ భరోసా ఇవ్వడం జరిగింది. కరంట్‌ ‌వైరు తగిలి కరంట్‌ ‌షాక్‌ ‌తో చనిపోయిన ప్రేంసాగర్‌ ‌మృతికి పూర్తి బాధ్యత ఎలక్ట్రిసిటీ  డిపార్టుమెంటు వహించా లని, ఎలక్ట్రిసిటీడిపార్టుమెంటు నిర్లక్ష్యం వల్లే అతను చనిపోయాడు కాబట్టి ఎలక్ట్రిసిటీ  డిపార్టు మెంటు మృతిని కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలన్నారు.

వారం రోజుల్లో వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించకపోతే కాంగ్రెస్‌ ‌పార్టీ బాధిత కుటుంబానికి అండగా ఉంటూ పోరాడుతామన్నారు. ప్రభుత్వం తరప •న కూడా చనిపోయిన కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని అన్నారు. వరద భీభత్సంతో ఆర్థికంగా నష్టపోయిన కుటుం బాలకు ఆర్ధిక సహయం అందించాలన్నారు. అనంతరం పోతన నగర్‌ ‌వరద ముంపుకు గురైన ప్రాంతాన్ని సందర్శి బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే మత్తడి పడ్డ  భద్రకా ళి చెరువును సందర్శించి, వడ్డేపల్లి 100 ఫీట్‌ ‌రోడ్డు, నయీం నగర్‌ ‌బ్రిడ్జిను సందర్శించారు. అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయ కుండా, వరదల పై కనీస అంచనాలేకుండా, వడ్డేపల్లి, భద్రకాళి చెరువులపై నిఘా లేకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల, నగరంలో ఉన్న చెరువుల కట్టలు తెగి, నీళ్లన్ని కాలనీల్లోకి, ఇళ్లలో్ల కి చేరుతున్నాయన్నారు.

భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ మూడు రోజులు ముందుగానే ముందస్తుగా హెచ్చరించినా ఎమ్మెల్యే, అధికారులు  పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే నగర ప్రజలకు ఈ దుస్థితి పట్టిందన్నారు. వరంగల్‌ ‌ప్రజలు నీట మునిగి ఆర్ధికంగా నష్టపోయి తినడానికి తిండి, తాగ డానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారన్నారు. వరద బాధితులకు కనీసం నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని, పక్క రాష్ట్రంలో నీ రాజకీయాల కోసం 500 వందల కార్లతో 600 కిలోమీటర్లు పోయినవ్‌ ‌కదా కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉంటే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్‌ ‌కు ఎందుకు పోవట్లే? అని ప్రశ్నించారు. స్మార్ట్ ‌సిటీ చేస్తామని ప్రజా ధనాన్ని వృధా చేసి, నేడు ఓరుగల్లు ప్రజలను వరదల్లో ముంచినవ్‌, ‌నువ్వు, నీ కుటుంబం, మీ నాయకులు మాత్రం ఫౌహౌస్‌ ‌లు కట్టుకుని సుఖంగా నిద్ర పోతున్నారన్నారు. స్మార్ట్ ‌సిటీ పేరుమీద ఏటా 300 కోట్ల రూపాయలు ఎటుపాయే?, అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజ్‌ ‌మాటేమో గానీ ఉన్న డ్రైనేజ్‌ ‌కాలువలు ముంచెత్తుతున్నాయన్నారు.

ప్రధాన నాళాలు పూడిక లేక నిర్లక్ష్యం వల్లనే పేరుకుపోయిన నీరు అంతా నగరంలో చొరబడిందన్నారు. 100 ఫీట్‌ ‌రోడ్‌ ‌లో నిర్మిస్తున్న డ్రైనేజి వల్లనే హన్మకొండ నగరం నీట మునిగిందన్నారు. ఏళ్లు గడుస్తు న్నా.. పనుల్లో జాప్యం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఎందుకంటే వారికీ అందాల్సిన పర్సంటేజ్‌ అం‌దలేదు కాబట్టే నిర్లక్ష్యంగా వదిలేశారని దుయ్యబట్టారు. నగరం నీట మునిగాక ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచనలు ఇస్తున్నారే తప్ప సహాయక చర్యలు చేపట్టుతున్నామని చెప్పట్లేదన్నారు. వరంగల్‌ ‌ప్రజలకి తక్షణమే రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రకటించి అందజేయాలని కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున డిమాండ్‌ ‌చేస్తున్నామన్నారు. ఈ కార్యక్ర మంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ ‌రెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్‌, ఆల్‌ ఇం‌డియా ఎస్‌ ‌సి డిపార్టుమెంటు కో-ఆర్డినేటర్‌ ‌డాక్టర్‌ ‌పులి అనిల్‌ ‌కుమార్‌,  ‌జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బంకసరళ, బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అద్యక్షు లు బంక సంపత్‌ ‌యాదవ్‌, ‌సీనియర్‌ ‌నాయకుడు మహమ్మద్‌ ‌సమద్‌, ‌డివిజన్‌ అద్యక్షులు ఎస్‌. ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌సైండ్ల శ్రీకాంత్‌, ‌గన్నారపు సంగీత్‌, ‌మంద రాకేశ్‌, ‌జి.శివ ప్రసాద్‌, ‌బొంత సారంగం, ఎర్ర మహేందర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *