- హిందూ అమ్మాయిలను టార్గెట్ చేశారు
- వరంగల్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
- బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- కొండగట్టులో దొంగతనంపై దిగ్బ్రాంతి
వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : మెడికో సూసైడ్ అటెంప్ట్ వెనక సీనియర్ వేధింపులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నా…దీన్ని చిన్న కేసుగా చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. 100 శాతం ఇది లవ్ జీహాదీ కేసేనన్న ఆయన… ఇది రాగింగ్ అండ్ లవ్ జీహాద్ కేసని వ్యాఖ్యానించారు. హిందు అమ్మాయిలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని చెప్పారు. నిందితుడు బయట ఉంటే కొడతారని చిన్న కేసు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. దీని వెనక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. కుక్క కరిచి చిన్న పిల్లోడు చనిపోతే కూడా ఇలాగే నిర్లక్ష్యంగా స్పందించారని సంజయ్ విమర్శించారు. ప్రీతి కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం మానవ మృగంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. ఈ ఘటనపై ఇంకా స్పందించ లేదని, ఎస్టీలంటే కేసీఆర్కు చిన్న చూపని ఆరోపించారు. ఇక కొండగట్టులో చోరీ ఘటనపై బండి సంజయ్ స్పందిస్తూ…కేసీఆర్ ది ఐరన్ లెగ్…అందుకే జరిగిందని ఇటీవల కెసిఆర్ పర్యటనను ఉద్దేశించి అన్నారు.
గర్భగుడికే రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందన్న ఆయన..ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని ఎద్దేవా చేశారు. కెసిఆర్, వారి కుటుంబసభ్యులు స్థలాలు కొన్నందుకే అభివృద్ధి జపం చేస్తున్నారన్న ఆయన.. అక్కడ సీసీ కెమెరాలు లేవా అని ప్రశ్నించారు. పిచ్చోడి పని అని కొండగట్టు కేసును పక్కదారి పట్టించినా పట్టిస్తారని ఎద్దేవా చేశారు. వి•రు దర్శించుకున్న కొండగట్టుపైనైనా స్పందించమని బండి సంజయ్ కోరారు. దేవునిపై కేటీఆర్కు నమ్మకం లేదని, హిందూ దేవుళ్లను అవహేళన చేయడంలో కేసీఆర్, కేటీఆర్, ఎంఐఎం పోటీ పడుతున్నాయని ఆరోపించారు. మేము రోజుకొక దేవున్ని పూజిస్తాం. వి•కేం నొప్పి అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ తీసుకునే వి•కు లవంగానికి, తంబాకుకు ఏం తేడా తెలుస్తుందంటూ మండిపడ్డారు. కేసీఆర్ దొంగల ముఠా ఆలయాలను దోచుకుంటుందని ఆరోపించారు.




