ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురు ఎమ్మెల్యేలు నియమితులయ్యారు. అసెంబ్లీలో విప్‌లను నియమించడం ఆనవాయితీ. అధికార పార్టీకి చెందిన వారిని నియమిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను విప్ లుగా నియమించింది. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్ నకు సంబంధించి కూడా త్వరలో నియామక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చీఫ్‌విప్‌గా పలువురు పేర్లు ప్రరచారంలో ఉన్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ , వేముల వీరేశం పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని సమాచారం. దీనిపైనా ఒకటిరెండు రోజుల్లో స్పష్టత రానుంది.




