ప్రపంచంతో పోటీపడాలి

  • సింగరేణి అనుబంధ అఫ్మెల్‌ అభివృద్ధికి చర్యలు
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
    ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఆగస్టు 14: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ హెవీ మిషనరీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌(Aూనవీజుూ) ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థ అఫ్మెల్‌ను సింగరేణి సిఎండి బలరాంతో కలిసి ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో, తదుపరి మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడిభాగాలు తయారీ, పాత విడి భాగాలను మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్‌ సంస్థలకు అఫ్మెల్‌ కన్నా మించి మిషనరీ, మానవ వనరులు లేవని అన్నారు. సంస్థలో పనిచేసే అధికారులు, కార్మికులకు కావాల్సింది ఒక నిబద్ధత, ప్రపంచంతో పోటీ పడగలం అన్న ఆలోచన, ఉన్న వ్యవస్థను సక్రమంగా వాడుకోవడం ఎలా అన్న తపన ఉంటే చాలని, మనం కూడా ప్రపంచంతో పోటీ పడగలమని డిప్యూటీ సీఎం భరోసా కల్పించారు. ఈ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీని నియమిస్తామని, అది స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ఏ తరహాలో ముందుకు పోవాలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారులు, సిబ్బంది ఎంత బాగా పనిచేస్తే అంత బాగా లాభాలు సాధిస్తామని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు ఉంటాయని, రాష్ట్రాల ప్రగతికి దోహదపడవచ్చునని తెలిపారు. సంస్థను, ఉన్న మిషనరీని పరిశుభ్రంగా ఉంచాలి, యంత్రాలకు ఓవరాలింగ్‌ చేయాలి, రంగులు వేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పనిచేసే సిబ్బంది తప్పకుండా భద్రతా చర్యలు పాటించాలన్నారు. కార్మికుల శ్రమ, ఉన్నత ఆలోచనలతోనే ఈ పరిశ్రమ ముందుకు పోతుందని తెలిపారు. ఈ పరిశ్రమ సింగరేణి కాలరీస్‌కు అవసరమైన కొత్త యంత్రాలు తయారు చేయడం, పాత యంత్రాల మరమ్మతు వరకే పరిమితం కాకుండా రాష్ట్రంలోనే కాదు, దేశానికి అవసరమైన ఆర్డర్స్‌ తీసుకొని బీహెచ్‌ఈఎల్‌ మాదిరిగాఅఫ్మెల్‌ పనిచేస్తుందని, థర్మల్‌ పవర్‌ స్టేషన్స్‌కు అవసరమైన యంత్రాలు, యంత్రాల మరమ్మతు చేస్తుందని, ఈ సంస్థను భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *