ప్రధాని నరేంద్ర మోడి ని మంగళ వారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలు కలిశారు. కమ్యూనిటీ సేవా ప్రయత్నాలపై దృష్టి పెట్టడం మరియు అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై విస్తృత చర్చలు చేసినట్లు మోడి ట్వీట్ చేసారు.
తెలంగాణలో సుపరిపాలన, వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలికేందుకు బీజేపీ కృషి చేస్తుందని ట్వీట్ లో పేర్కొన్నారు.




