న్యూ దిల్లీ, జూలై 3 : దేశ రాజధాని దిల్లీలో ఉన్న ప్రధాని మోదీ నివాసంపై ఓ గుర్తు తెలియని వస్తువు ఎగిరినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువుల్ని పోలీసులు గుర్తించలేదు. డ్రోన్ లాంటి ఒక వస్తువు ప్రధాని మోదీ ఇంటిపై ఎగురుతున్నట్లు తెల్లవారుజామున 5 గంటలకు పీసీఆర్ ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అయితే సెక్యూర్టీ ఏజెన్సీలు ఎటువంటి అనుమానిత వస్తువును నేరుగా గుర్తించలేదు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) కూడా ఎటువంటి అనుమానిత ఆబ్జెక్ట్‌ను గుర్తించలేదన్నారు. ఎన్డీడీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం రాగానే, ప్రధాని మోదీ నివాసం వద్ద ఉన్న సప ప్రాంతాల్లో ప్లయింగ్ ఆబ్జెక్ట్ కోసం వెతికామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కూడా ఎటువంటి ప్లయింగ్ వస్తువును గుర్తించలేదని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.



