హరీష్ రావు చిట్ చాట్ కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: ప్రతీ దాన్ని రాజకీయం చేయటం మాజీ మంత్రి హరీష్ రావుకు అలవాటుగా మారిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హరీష్ రావు వ్యవస్థలను రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిప్డడారు. రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్ గా నియమించారన్నారు. హరీష్ చిట్ చాట్ కు స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు శాసనసభ వ్యవహారాలమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలి? అని ప్రశ్నించారు. కేసీఆర్ హాయాంలో హరీష్ రావుకు రాజ్యాంగం గుర్తుకు రాలేదా ? అన్నారు. పీఏసీ ఛైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు.
ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం ? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ వేదికగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందన్నారు. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీఫ్ విప్ బాధ్యత అన్నారు. మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా… ప్రతి పక్ష పార్టీ సభ్యులకా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఎందుకు ఇది మరో ఉదాహరణ అన్నారు. అయితే హరీష్‌రావు చిట్ చాట్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.



