ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 26 : ప్రస్తుత వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మైసిగండి సర్పంచ్ రామవత్ తులసి రామ్ నాయక్ అన్నారు. బుధవారం మైసిగండి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకొని పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.


