కూకట్ పల్లి, ప్రజాతంత్ర, జులై 19 : బాలానగర్ డివిజన్ పరిధిలోని నవజీవన్ నగర్ విఘ్నేశ్వర ఆలయంలో బుధవారం వడ్డేపల్లి రాజేశ్వరరావు స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి, కోమటి బస్తీ నుంచి గడప గడపకు నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సేవా సుపరిపాలన గురించి తెలియజేస్తూ 42వ రోజు ఇంటింటికి బిజెపి భరోసా యాత్రను జయప్రదంగా కొంసాగిస్తున్నారు. ఈ సందర్బంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. తుఫాను కారణంగా వర్షం పడుతున్న సరే ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుండి విముక్తి చేయడానికి పోలింగ్ బూత్ నంబర్ 30, 31 లో స్థానిక కార్యకర్తలు ప్రజల యొక్క సహకారంతో ముందుకు కొనసాగుతున్నామని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు మారినా అధికారులు మారిన ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన ఈ ఇనుప కరెంటు స్తంభాలను మార్చడం లేదని, వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు భయంతో బతుకుతున్నారని అన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరుతున్నాయని స్థానిక ప్రజలు వారు పడుతున్న ఇబ్బందులను తనకు తెలియజేస్తున్నారని, ఆ సమస్యలు అన్నింటికీ పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కోరారు. అదేవిధంగా వర్షాకాలం దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడ వ్యక్తిగతంగా శ్రద్ధ చూపిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇనుప కరెంటు పోల్స్ నుండి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ నర్సిరెడ్డి, జిల్లా మాజీ కార్యదర్శి సురేందర్ రెడ్డి , జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్తూరు రమేష్, డివిజన్ అధ్యక్షుడు జీ.రమేష్, మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ కల్పన, బీజేవైఎం కార్యవర్గ సభ్యులు మధు, డివిజన్ ప్రధాన కార్యదర్శులు ఏ.లక్ష్మణ్, డి.వెంకట శేనారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు శివరంజని, ఓబీసీ మూర్ఛ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గౌడ్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎడ్ల అనిల్ కుమార్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు కోట్ల నాయక్, బీజేవైఎం నాయకులు పద్మారావు, సీనియర్ నాయకులు అశోక్, ఇంద్రసేన, బీజేవైఎం సమంత్ గౌడ్, సందీప్ డివిజన్ లోని నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




