ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 14: కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం ఆంతరం,బిచ్చాల్ గ్రామంలో కొడంగల్ నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్  ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఉన్నది కావున ప్రజలు కాంగ్రెస్ చెప్పే  మాయ మాటలు నమ్మకుండా కారు గుర్తుకు ఓటు చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు ఎన్నికల అప్పుడు వస్తుంటారు పోతుంటారు ఆరు గ్యారంటీలు అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ముందు పక్క రాష్ట్రం కర్ణాటకలో పథకాలు అమలు చేయాలి అని అన్నారు.దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ప్రజలంతా మూకుమ్మడిగా కారు గుర్తుకు ఓటు వేసి బారి మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *