ప్రజా పాలన 6 గ్యారెంటీల అమలు కోసమే ప్రజా పాలన

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జనవరి 3: పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్, రుద్రారం  గ్రామలలో ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను బుధవారం వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీలు అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశ్యంతో ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు పది రోజులు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు గడ్డం బాలమణి శ్రీశైలం, పట్లోళ్ల సుధీర్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఎంపీవో హరిశంకర్ గౌడ్, ఐకెపి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, అంజి రెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి, ఉప సర్పంచ్ లు శోభక్రిష్ణ రెడ్డి, యాదయ్య, పంచాయతీ కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, రాజ్ కుమార్, రిజ్వాన్, వార్డు సభ్యులు మంజుల గోపాల్, సందీప్ గౌడ్, లక్ష్మారెడ్డి, లావణ్య నర్సింహులు, వనిత, భారతి గౌడ్ వనమ్మ, మాజీ సర్పంచ్ వెంకన్న, వార్డు సభ్యులు నాయకులు ఆదిత్య రెడ్డి, అచ్యుత రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సంపత్, శ్రీను, మల్లేష్ తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *