తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రొఫెసర్ కేశవ్ రావు జాదవ్, ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాగాయకుడు గద్దర్,కాళోజీ నారాయణరావు ,ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో ముందు నడిచారు . సామాజిక తెలంగాణ కోసం ముందు వరుసలో ఉండి నాయకత్వం వహించిన మారోజు వీరన్న,తెలంగాణ రాష్ట్రం కోసం అడి పాడినందుకు పదిహేడు ముక్కలైన బెల్లి లలిత అక్క, తొర్రూరు అయిలన్న ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు కనకచారి,ఆకుల భూమయ్య వంటి వారి,త్యాగం అమరత్వంలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విలువ, గౌరవం,ప్రాధాన్యత కల్పింకాకపోవడం విచారకరం .ఈ విషయం లో తెలంగాణ ఉద్యమకారులు ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు?పాలకులు వోటు బ్యాంక్ రాజకీయాలను ప్రభావితం చేయడం కోసం మాత్రమే కా.గద్దర్ పేర విగ్రహాల ఏర్పాటు,అవార్డులు ఇవ్వపునుకోడం తో ఆంతర్యం ఏమిటి? అవార్డు ప్రకటించగానే ఎగిరి గంటులేసినంత పని చేస్తున్నారు.పాలకుల స్వార్థ రాజకీయాలకు,ప్రయోజనాలకు ప్రజా క్షేత్రంలో పనిచేసిన వారి పేరును ఉపయోగించుకోవడం కోసం కుట్ర జరుగుతుడవచ్చు,అనే విషయాన్ని కొంతమంది గ్రహించ నిరాకరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తో ఉద్యమ పార్టీ కాస్త ఫక్తు రాజకీయ పార్టీగా అవతారం ఎత్తి పది సంవత్సరాల పాటు అధికారం చెలాయించింది.అమరుల ఉసు లేకుండ చేశారు.నిరాశ, నిస్పృహలకు లోనైన ఉద్యమకారులు పాత పాలక పక్షం నుండి నయ,పాత పాలక పక్షానికి అధికారాన్ని బదలయించడంలో కీలక భూమిక నిర్వహించారు.అటువంటి ఉద్యమకారుల మెప్పు కోసం అన్నట్లు గద్దర్ పేర పాలక పక్షం వల విసురుతోంది. గద్దర్ పేర విగ్రహాలు,అవార్డులు సరే, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, కాళోజీ నారాయణరావు నుండి ప్రొఫెసర్ జయశంకర్ వరకు తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన వారి మాట ఏమిటి ? గద్దర్ తన ఆఖరి పది సంవత్సరాల కాలంలో రాజ్యాంగం పరిధిలో పని చేసిండు కాబట్టి గద్దర్ కు విగ్రహాలు,అవార్డులు సరిjైునది అంటున్నారు.అదే క్రమంలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్,కాళోజీ నారాయణరావు ,ప్రో.జయశంకర్,బెల్లి లలిత, కనకాచరి, మారోజు వీరన్న,ఆకుల భూమయ్య , కనకాచారి, బెల్లి లలిత వంటివారు కూడ ప్రజాక్షేత్రంలో పని చేసి ప్రాణాలు కోల్పోయిన వారే. అటువంటి అప్పుడు వారిని అందరినీ ఏ సందర్భంలోనూ కనీసం స్మరించకుండ,గుర్తించకుండా,కే
గద్దర్ ప్రజా ఉద్యమాలకు మొదలు కాదు ఆఖరు కాదు.నడుస్తున్న కాలంలో,చరిత్రలో ఒక చిన్న పార్ష్యమే.అవునన్నా కాదన్నా ప్రజల కోసం పని చేసిన వారి జ్ఞాపకాలను,త్యాగాలను ఎత్తి పట్టుకోవాల్సిన పని ఎవరు చేయాలి అన్నప్పుడు దోపిడీ, పీడన,అణిచివేతకు గురి అయిన,అవుతున్న పీడిత ప్రజలే.ఎందుకంటే వారి నుంచి స్ఫూర్తిని పొందడం కోసం,భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించడం కోసం. పాలక వర్గం పీడిత వర్గాలకు నాయకత్వాలు,ఆదర్శాలు లేకుండ చేయడం కోసం కూడ విగ్రహాలు,అవార్డులు పెట్టీ కుట్ర రాజకీయాలు చేయవచ్చు అనే విషయాన్ని మనం గ్రహించాలి. నిజంగా పాలకవర్గాలకు చిత్త శుద్దే వుంటే అమరులు కోరుకున్న ఆకాంక్షలు నిరవెర్చలి.బియ్యాల జనార్ధన్ నుండి గద్దర్ వరకు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం డిమాండ్ చేశారో ఆ లక్ష్యాలను నెరవేర్చాలి. అంటే రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రజాస్వామ్యం, లౌకికవాదం సామ్యవాదం దిశగా సభ పెట్టుకునే అవకాశం,నిరసన తెలిపే అవకాశం ,మాట్లాడే అవకాశం కల్పించాలి, భూమి విషయంలో కోనేరు రంగారావు సిఫార్సులు అమలు చేయాలి.తెలంగాణ రాష్ట్రంలో ఖాలీ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి,మూత పడ్డ పరిశ్రమలు తెరిపించాలి.ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలి,పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి,ఒపెన్ కాస్ట్ ల స్థానంలో అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు తవ్వాలి,రైతుల ఉత్పత్తులు గిట్టబాటు ధర కల్పించాలి,నాణ్యమైన విద్య, వైద్యం మారుమూల పల్లెలకు విస్తరించాలి.నీళ్ళు, నిధులు నియామకాలు లక్ష్యంగా పాలకులు పాలన చేయాలి. ఆ దిశగా తెలంగాణ ఉద్యమకారులు పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం,ఒక ప్రక్క దేశంలో మతోన్మాద శక్తులు అధికారంలో కొనసాగుతూ కుల, మత, ప్రాంతీయ,భాష పరమైన విద్వేషాలతో దేశ విచ్చినానికి కారణమవుతున్నందున వారికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యం, ఐక్యత, పోరాటంలో భాగస్వామ్యం, కావడం మాత్రమే గద్దర్ కు నిజమైన నివాళి.
-బెజ్జంకి ప్రభాకరాచారి
రాష్ట్ర కమిటి సభ్యుడు,
తెలంగాణ విద్యావతుల వేదిక





