ప్రజాదరణ చూసి ఓర్వలేకనే బాబు అరెస్టు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అప్రజాస్వామికమని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు గొంటి కుమార్ చౌదరి యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో త్రీవంగా ఖండించారు. చంద్రబాబుకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఏపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగానే పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టారని, 409 లాంటి కేసులు పెట్టడం ఏంటనీ, సీఐడీ అధికారులు మాజీ సీఎం పట్ల వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అరెస్ట్ అప్రజాస్వామికం సీఐడీ అధికారుల తీరు ఏపీలో ఇదేవిధంగా వుంటే తెలంగాణలో ధర్నాలు, నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. టీడీపీ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ తరపున టీడీపీ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు వుంటుందని గొంటి కుమార్ చౌదరి యాదవ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *