బళ్ళు శెరువులాయె,బల్లలు నీల్ల మీద తేలుడాయె! యే సౌలతుల్లేక బడిపోరల్లకు తిప్పలైసదువు సట్టుబండలాయె! అయితె అయింది గని గీ ముచ్చటబయటికి తెల్వనియ్యకుండ్రి. మీడియా,విద్యార్థి సంఘాలు ఎన్జీవోలను బళ్ళెకు రానీయకుండ్రి! ఎంత తిప్పలయినా,సౌలతుల్లేకున్నా మీ సావు మీరు సావుండ్రి గని బయిటోళ్ళకు గీ ముచ్చట యెరుకైతె లోకవంత యెరికైతది! ఓర్నియవ్వ!యేతులకే గని తెలంగాణ ల బళ్ళు సంకనాకి పొయినయని సోయి సొక్కమైతె లేకుంటుండాలె ! అంతేకదా! అదిగాక “ఇజ్జెత్ బోతది! గిసొంటి ముచ్చట్లుగిట్న బయిటిగత్తె గనుక! యెవల్నన్న లోపలికి గిట్న రానిత్తె పెద్దసార్లు,పంతుళ్ళ సంగతి అయితదుల్లా పైలం!” అని తెలంగాణ సర్కార్ బెదిరిచ్చుడు.
“అత్త గొట్టిందానికి గాదుగని తోడికోడలు నవ్విందని ఏడిశిందట ఒకామె” గీ తీర్గున్నది. మన సర్కార్. జెరంత వానలకే బళ్ళు శెరువులయ్యేకాడ వానలు యీ యేడు దంచికొట్టబట్టె!, బళ్ళు శెరువులాయె,బల్లలు నీల్ల మీద తేలుడాయె! యే సౌలతుల్లేక బడిపోరల్లకు తిప్పలై
సదువు సట్టుబండలాయె! అయితె అయింది గని గీ ము
చ్చటబయటికి తెల్వనియ్యకుండ్రి. మీడియా,విద్యార్థి సంఘాలు ఎన్జీవోలను బళ్ళెకు రానీయకుండ్రి! ఎంత తిప్పలయినా,సౌలతుల్లేకున్నా మీ సావు మీరు సావుండ్రి గని బయిటోళ్ళకు గీ ముచ్చట యెరుకైతె లోకవంత యెరికైతది! ఓర్నియవ్వ!యేతులకే గని తెలంగాణ ల బళ్ళు సంకనాకి పొయినయని సోయి సొక్కమైతె లేకుంటుండాలె ! అంతేకదా! అదిగాక “ఇజ్జెత్ బోతది! గిసొంటి ముచ్చట్లుగిట్న బయిటిగత్తె గనుక! యెవల్నన్న లోపలికి గిట్న రానిత్తె పెద్దసార్లు,పంతుళ్ళ సంగతి అయితదుల్లా పైలం!” అని తెలంగాణ సర్కార్ బెదిరిచ్చుడు. ఇంతాంత ఇచ్థంత్రం కాదుల్లా! దొంగోడచ్చిండని తలపు గొళ్ళెం బిడాయించుకోని ఇంట్ల దాగున్న తీర్గున్నది.బళ్ళ తిప్పలేందో అర్సుకునేందుకు మీడియా, విద్యార్థి సంఘాలు మాగత్తయి, వాటి పని అదేనాయె! ఎన్జీవోలెవలైన వత్తె గినుక మంచో శెడో జర్రంత అర్సుకుంటరు.నాలుగు పైసలు సాయం గిట్న జేశేందుకు ముందుబడ్తయి. “అవ్వపెట్టదాయె! యెవలను అడుక్కోనీయదాయె!” అన్నం శాత్రంగోలిగున్నది.
మొన్నీమద్దెన మన ముక్కెమంత్రి సారు మనువడు
పట్నంల ఓ సర్కార్ బడికి బోయిండు.పాపం! మస్తు బా
ద పడబట్టిండట.బడి ముందు కారు దిగి “ఏందుల్లా గీ బడి బయిటినుంచి సూడనీకె దివాల్ గొట్టుతీర్గున్నద”ని అనుకున్నడు.బడి మైదానంల రాళ్ళురప్పలతోని ఆగం
తీర్న కానచ్చిందట!ఓరిత్త!యేందిది ?అని అనుకుంటాం
టెనె ఇంతల్న ఓ బడిపోరడు ఉరికచ్చి మెట్లకాడ బోర్ల
బొక్కల పడుడు,వాని కాలుకి దెబ్బ తగిలి నెత్తురు బొట
బొట కారుడు సూశినంక అయ్యో! ఆ మెట్లు సూత సరి
గ్గ లెవు పాడుబడి !ఆ పిలగాడు “నేను సదివే బడి తీర్గ వుంటదనుకున్న గని నెరీ గిట్న పాడుబడ్డందేందుల్లా” అ
నుకున్నడట!అటు మొగాన ఆడిపిలగాండ్ల వాష్ రూంల
ముందు పందులు తిరగబట్టినయంట,అరె !అట్లయితే ఆడిపిలగాండ్లు అవెట్ల వాడుకుంటరు!యేందిది!ఆగమా
గం ,అడివడివి! సర్కార్ బడేనా !పందులు తిరిగేటి జా
గనా! మా తాత అవ్వల్ దర్జా గ తెలంగాణ బళ్ళు యెలి
గిపోతానయని జెప్పేడిది ఒట్టి ముచ్చటేనా! మా నాయ
న సూత మీటింగులల్ల జెప్తాంటడు. అదుంటది ,ఇదుం
టది అని లచ్చ తొంబయి జప్పంగ ఇనుంటిని !అవన్ని సూత ఒల్లెక్కాల కతలేనా! పాపం గా పిలగాడు సుకాల
ల్ల పుట్టి పెరిగినోడాయె!మస్తు బాదపడబట్టిండు.ఆ బడి
కి సుట్టు గోడలు లేవు , గేటు లేదు! ఇవన్నీ సూశి గా పి
లగాని కండ్లల్ల నీళ్ళు తిరిగినయంట!హెడ్ మాస్టర్ రూం సూడబోతె ఓరిత్త!అండ్లనే బియ్యంబత్తలు,అండ్లనే ఆపీ
స్,అండ్లనే సార్లు కూసునేది ,అండ్లనే పిలగాండ్ల కు సదు
వు జెప్పుడు కానచ్చి! తాత రాజ్జెంల సర్కార్ బడి గింత దరిద్రంగ వుంటదనుకోలే!పసి పిలగాడాయె!లోకం తెల్వ
నోడాయె! పదివేల మొక్కలు నాటాలె !గేట్ బెట్టాలె !గో
డలు గట్టాలె! బళ్ళె పైసలేపాటున్నయని అడిగె సరికె అ
క్కడున్న పెద్ద పంతులమ్మకు పానం మీద మీదనె పొ
యుండాలె!మస్తు బుగులయిందామెకు. “బడికి సాలుక
చ్చే పైసలు యే మూలకు సాలయి, శీపుర్లు , శాక్ పీసు
లకే తక్కువ బడ్తయని”!గిది ముచ్చట అని జెప్పె!అది
యినంగనె పిలగాడు పరెశానయుంటడు.సర్కార్ బళ్ళు గింతగనం తిప్పల్లుంటయా! సదువులెట్ల సాగుతయి ? అనే ఆలోచన జేశిండు.ఓ సర్కార్ బడికి నడువాలంటె యేపాటి నిధులుండాలె!యెసొంటి సౌలతులుండాలె!యెట్లుండాలె!యెందుకుండాలె!బళ్ళెకిచ్చే నిధులేపాటి!
కనీస సౌలతులకయ్యేది యేపాటి !? అని అరుసుకున్న పసి పిలగాడైన గా మనువడికి వున్న సోయి తాతకు లే
కపాయె ! అని అందరు శెవులు కొరుక్కోబట్టె! అయిత
యిందిగని అనుకోని సోపతిగాండ్ల తాన పైసలు జమేశి ఆ బడిని అవ్వల్ దర్జా జేశినంకనే ఆ పిలగాడు నిమ్మల
మైండు.
కండ్లతోని జుశిండు కాబట్కె మనుసుబెట్టి సోంచాయిం
చిండు.తెలంగాణ బళ్ళ తరుపున నీకు శనార్తులుబిడ్డా!
సర్కార్ బడి తరుపున నీకు మొక్కాల్నే నాయినా! నీకున్న పాటి సోయిల గింతంతన్న మీ తాతకు,నాయనకు వుంటె బాగుండ”ని లోకవంత గా పిలగాని పెద్దమనుసుకు మెచ్చుకుంటిరి ! మనువడు ఒక్క బడి జూడబోతెనేఎన్ని లచ్చలు బెడితె యే సౌలతులు జేయత్తదని యెరుకైనప్పుడు యేకంగ తాతనే గనుక అన్ని బళ్ళు తిప్పుతె మస్తు మంచిగుంటది ! ఏకంగ మనువడే పనిబడ తాత
ను యెంబడి తోల్కబోయి అన్ని సర్కార్ బళ్ళను సూపె
ట్టాలె ! శెరువులైన బళ్ళు, పందులు తిరిగే బళ్ళు ,సుట్టు
గోడ లేని బళ్ళు, పిలగాండ్లు వుండి పంతుళ్ళు కరువైన బళ్ళు,పంతుళ్ళే పాయికానాలు కడిగేటి బళ్ళు, తాగేటం
దుకు,కడుగుకునెటందుకు సుక్క నీళ్ళులేని బళ్ళు,మూ
లమలుకల బోరింగ్ నీళ్ళు దెచ్చుకోని తానం బోసుకునే పిలగాండ్లు వుండే హాస్టల్లుఇవన్ని సుత బాగు పడుత
యి. ఫామవుజుల కూసోని శింతమడక కతలు వడుడు కాదు, మనువడి తీర్గ ఒక్కదినం మనుసు బెట్టి రోజొక్క బడికి బొయినా సాలు! సర్కార్ బళ్ళు బాగుపడ్తయని లోకమనుకోబట్టె!
సరె! గని ఆ బడి బాగుపడేటందుకు సి.ఎస్.ఆర్ అనే ఎన్జీవో వాళ్ళు సుత పైసలు సాయం జేశిండ్లట! గా పిల
గాడే జెప్పిండు గదా!…యెరికున్నంక కొత్తంగ సర్కార్ ‘ఈన్నుంచి బళ్ళకు ఎన్జీవోలను రాకుండ జూడాలె!’ అని జెప్పుడెక్కడిది !? “కేజీ నుంచి పీజీ”దాంక సదువులేం
దో మాగనే పొడుగం జేశిండ్లు గని , వున్న బళ్ళల్ల సదు
వు జెప్పే పంతుళ్ళే కరువాయె ! పంతుళ్ళ జీతాలు నెల మద్దెన రాబట్టె!అన్ని కొత్తలం రాలని ఇకమతులేనాయే! ఇంక పొద్దటి పూట రాగిజావంటిరి , అన్నం వండినోళ్ళకే నెల బిల్లులు గీశిగీశి యియ్యబడితిరి. “మన ఊరు మ
న బడి” రొండో మల్క పనులు మాగనే షురువైనయి గని గుత్తెదార్లకు ఇంతవరకు కొత్తలు లేవు. అయిన కాడికి అయినయి,ఇక్కడితోని ఒక్కశిత్తం, ముందు ముం
దు కొత్తలు రాలుడు అనవానమే.! ఓట్ల పండుగచ్చుడం తోనె పనులు పంటయి. ఇది నికరం జేసుకున్నరు గనుక
నే. ఈ కొత్త ముచ్చట ఇనిపిత్తాండ్లు. ష్…బయటి నుంచి యెవల్ని బళ్ళె లోపలికి రాకుంట జూడాలె! అంటె యెట్ల వాజీబయితది !? సర్కార్ బళ్ళల్ల సమస్యలు అర్సుకో
నీకి విద్యార్థులు రావాలె, మీడియా రావాలె!లేకుంటె బ
యిటి పపంచానికి ఆ బళ్ళ తిప్పలేందో యేనంగ యెరు
కైతయుల్లా! కదా! బళ్ళల్ల యే పండుగైనా,ఏ కార్యెమైన
దాతల సాయం తీసుకోవాలె!అని జెప్పేది మీరేనాయె! దాతలేనంగత్తరు! ఎన్జీవోల పేరుతోని కాకపోతె ! బళ్ళకు ఇంకెవలత్తరు..యేదన్న తిప్పలుంటె అర్సుకుంటరు. గా
ళ్ళు రాకుండ జేసుడు ఇచ్ఛంత్రం గాకుంటె యింకేందు
ల్లా! బడ్జెట్ ల సదువుల కోసం యిచ్చే నిధులు తగ్గిచ్చు
డేంది!? బళ్ళ సౌలతులు లేకుంట ఆగం జేసుడేంది !? బడి ముచ్చటలు బయిటెరుకైతయని గీ బుగులేంది!? పజాసామ్యంల పభుత్వం పారదర్శకంగ వుండాలె గదా! పజల భాగసామ్యం అని అనుకుంటనే ఇంకో దిక్కు పజ
లను లోపలికి రావద్దని జెప్పుడెక్కడిది !? పెద్దసార్లను పంతుళ్ళను గీ బెదిరిచ్చుడేంది. సర్కార్ బళ్ళంటె పజ
లయే గదా! పజల హక్కును ఆగం జేసుడేంది!? అని
అందరు జెప్పుకోబట్టిండ్లు.
ఎలమంద,
తెలంగాణ.




