- రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి
- కొరోనా వ్యాప్తిపై కేంద్రం అప్రమత్తం
- ఉన్నత స్థాయి అధికారులతో కేంద్ర మంత్రి మాండవీయ సవి•క్ష
- వారానికోమారు ఇక సవి•క్ష జరపనున్నట్లు వెల్లడి
న్యూ దిల్లీ, డిసెంబర్ 21 : రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. చైనా సహా అనేక దేశాల్లో మళ్లీ కొరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫోర్త్‌వేవ్ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. దేశంలో కొరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వారానికొకసారి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. చైనా, జపాన్, అమెరికా సహా పలు దేశాల్లో కేసులు విజృంభిస్తున్న క్రమంలో కేంద్రం పరిస్థితిని సవి•క్షించింది. దీంతో మహమ్మారి పరిస్థితులపై అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన బుధవారం దిల్లీలో ఉన్నతస్థాయి సవి•క్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్‌తో పాటు ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ..
కొరోనా ఇంకా ముగిసిపోలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిఘాను మరింత పటిష్టం చేయాలని సంబంధిత వర్గాలను ఆదేశించానని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తగిన పరీక్షలు నిర్వహిస్తున్నామని కొరోనా టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె. పాల్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. అంతర్జాతీయ ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు లేదని అన్నారు. ఈ సవి•క్షా సమావేశం ముఖ్యంగా 6 కీలక అంశాలపై జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో కేసులను నిరోధించే వ్యూహం, విదేశాల నుంచి ప్రయాణించే ప్రయాణీకుల కోసం మార్గదర్శకాలు రూపొందించడం, కొరోనా కొత్త వేరియంట్ పై నిపుణులతో సంప్రదింపులు జరడం వంటివి ఇందులో ఉన్నాయి.
రాబోయే కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించిన ప్రోటోకాల్‌పై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పొరుగు దేశం చైనాతోపాటు ప్రపంచ దేశాల్లో మళ్లీ కొరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. ఇకపై దేశంలో కొరోనా పరిస్థితులపై చర్చించి చర్యలు తీసుకొనేందుకు ఈ ఉన్నతస్థాయి కమిటీ భేటీ ప్రతివారం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రపంచ దేశాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశించారు. ‘కొరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు…అప్రమత్తంగా ఉండాలి.. పర్యవేక్షణ మరింత పటిష్టం చేయాలని అధికారుల్ని ఆదేశించాం..
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం‘ అని సమావేశం అనంతరం మాండవీయ ట్వీట్ చేశారు. దేశంలో 28 శాతం మంది మాత్రమే బూస్టర్ డోస్ వేసుకున్నారని, వయోవృద్ధులు బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న చాలా మంది కాంగ్రెస్ నేతలకు కొరోనా పాజిటివ్ వొచ్చినట్టు ముగ్గురు రాజస్థాన్ ఎంపీలు తనకు లేఖ రాశారని కేంద్ర మంత్రి అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి కోవిడ్ సోకిందని మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ సవి•క్షా సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, జాతీయ టీకా సాంకేతిక సలహా బృందం ఛైర్మన్ ఎన్ఎల్ ఆరోరా, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్, ఆరోగ్యశాఖ ఇతర ఉన్నతాధికారులు, ఆరోగ్య, ఆయుష్, ఔషధ, బయోటెక్నాలజీ విభాగాల కు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఇంటా బయటా రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ విజ్ఞప్తి చేశారు. వృద్ధులు లేదా అనారోగ్య సమస్యలున్నవారు సహా అందరూ మాస్క్‌లు ధరించడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.




