‌ప్రగతి ప్రధాతకు పట్టం కడదాం

  • ప్రతిపక్షాలు డిపాజిట్ల కోసం పోరాటం చేయాల్సిందే ..గడపగడపకు అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించండి
  • ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అంధకారమే : ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి

పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతకాని ప్రతిపక్షాలు నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం మేమున్నామంటూ మేనిఫెస్టోలు ప్రకటించడం సిగ్గుచేటని పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి ఘాటుగా విమర్శించారు.దశాబ్ది కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించి, బిఆర్‌ఎస్‌ ‌పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించాలని పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి కోరారు.

శనివారం రామచంద్రాపురం డివిజన్‌ ‌పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ ‌లో ఏర్పాటుచేసిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ రామచంద్రపురం భారతీయ నగర్‌ ‌డివిజన్ల విస్తృతస్థాయి సమావేశానికి శాసనమండలి మాజీ చైర్మన్‌ ‌భూపాల్‌ ‌రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం దశాబ్ది కాలంలో ఒకవైపు అభివృద్ధి మరో వైపు  సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలుచేసి ప్రతి ఒక్కరి ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామంటూ బిజెపి పార్టీ ప్రకటన చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. దేశంలో కులగనను చేసేందుకు మీన మీసాలు లెక్కిస్తున్న బిజెపి పార్టీ బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తామనడం సిగ్గు చేటని విమర్శించారు.

60 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రజల ఆర్థిక అసమానతలను తొలగించడంలో పూర్తిగా విఫలం చెంది నేడు పేదల సంక్షేమం కోసం పనిచేస్తామంటూ ప్రగలభాలు  పలకడం వారి దుర్నీతికి నిదర్శనమని విమర్శించారు.సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో గత పది సంవత్సరాల కాలంలో శాంతి భద్రత సమస్యలు లేకుండా పట్టణం పల్లె అని తేడా లేకుండా ప్రతి గ్రామం పట్టణాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు.

నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రతి గల్లీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనతను బిఆర్‌ఎస్‌ ‌పార్టీకే దక్కిందని తెలిపారు.  రాబోయే 30 రోజులు ప్రతి కార్యకర్త సైనికుడి వలె పనిచేసి పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ ‌రెడ్డి, పుష్ప నగేష్‌, ‌మాజీ కార్పొరేటర్‌ అం‌జయ్య యాదవ్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సర్కిల్‌ అధ్యక్షులు పరమేష్‌ ‌యాదవ్‌, ‌డివిజన్ల అధ్యక్షులు గోవింద్‌, ‌పృథ్వీరాజ్‌, ‌మార్కెట్‌ ‌కమిటీ డైరెక్టర్లు ఐలేష్‌, ‌సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌సీనియర్‌ ‌నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *