పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం  కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, ఆరోగ్య కర సమాజం తయారు చేయడంలో అంగన్వాడీల పాత్ర గణనీయమైనదని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుందని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలిపారు. బుధవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో గల అంగన్ వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ సముద్రం సాయి కుమార్, మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ, మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుండి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  కేసిఆర్ కిట్, అమ్మ ఒడి, కేసిఆర్ న్యూట్రిషన్ కిట్లు, ఆరోగ్య లక్ష్మీ లాంటి విప్లవాత్మక పథకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మా రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. సంక్షేమంతో పాటు 23వ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎళ్ళవేలలా అందుబాటులో ఉంటానని, వార్డులో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్స్ సముద్రం సాయి కుమార్, కౌడే మహేష్ కురుమ, ఎసిడిపిఓ ఉదయ శ్రీ, ఎసిడిపిఓ స్వర్ణలత, అంగన్ వాడీ టీచర్స్ సూపర్ వైజర్ హైమావతి, మేడ్చల్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం సభ్యులు ప్రియాంక, వాసవి, సరితా మేడ్చల్ మున్సిపల్ అంగన్ వాడీ టీచర్లు శోభా, ఇందిరా, విజయలక్ష్మి, ఉమారాణి, ధనలక్ష్మీ,ఆశా వర్కర్లు వసంత,అంగన్ వాడీ ఆయాలు,బాలింత స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, తల్లులు, పిల్లలు మేడ్చల్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *