పోలీసులు తనిఖీలలో రూ. 2.48 లక్షలు నగదు సీజ్

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ఎన్నికల కోడ్లో భాగంగా పోలీసుల చేపట్టిన తనిఖీలలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 2లక్షల 48 వేల నగదు ను పోలీసులు సీజ్ చేశారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు  తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఇందిరా చౌక్  వద్ద తనిఖీలు చేపడుతుండగా ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 1లక్ష 12 వేలు, మరో వ్యక్తి నుంచి 1లక్ష 36 వేలను ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించి నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి స్క్రీనింగ్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు ఇట్టి నగదుకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే నగదును తిరిగి అప్పగించినట్లు సీఐ తెలిపారు ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ప్రతి ఒక్కరూ 50 వేలకు మించి నగదును తరలించవద్దని, ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *