మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించే పోతురాజుల ఊరేగింపు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడుతాయని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి బాలాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోతురాజుల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా కన్నుల పండువుగా నిర్వహించారు. బాలాపూర్ యూత్ అసోసియేషన్ సభ్యులు బాలాపూర్ లడ్డు, రజినీకాంత్, జ్ఞానేశ్వర్, సందీప్, రఘు ఆధ్వర్యంలో నిర్వహించిన పోతురాజుల ఊరేగింపు కార్యక్రమానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డితో పాటు డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, టిపిసిసి కార్యదర్శి ఏలిమేటీ అమరేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డి, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎర్ర మహేశ్వరి జైహింద్, బండారి మనోహర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వంగటి లక్ష్మారెడ్డి, అత్తాపురం శ్రీనివాస్ రెడ్డి, తిమ్మిని గిరీష్, కొప్పుల రాజు, మున్నా, యువ నాయకులు అశ్విన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




