పోడు పట్టాలతో పాటు సంబంధిత కేసులన్నీ మాఫీ

  • ఇక ముందు వారిపై ఎలాంటి కేసులూ ఉండవు
  • మహిళల పేరుమీదే పట్టాలు
  • ఆసిఫాబాద్‌ ‌జిల్లాల్లోనే 47 వేల ఎకరాలకు పట్టాలు
  • పట్టాలతో పాటు రైతుబంధు కూడా అమలు
  • ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీ ఫేజ్‌ ‌కరెంట్‌కు ఆదేశాలు
  • కౌటాలా వార్ధా మధ్య బ్రిడ్జికి 75 కోట్లు
  • ఆసిఫాబాద్‌ ‌పోడు పట్టాల పంపిణీ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌ప్రకటన
  • వేదికపై సాయిచంద్‌కు కెసిఆర్‌ ‌నివాళి

కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌గిరిజనులకు పోడు పట్టాలు అందించడంతో పాటు వారికి మరో శుభవార్తను కెసిఆర్‌ అం‌దించారు. పోడు భూములకు సంబంధించి ఆదివాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. ఇక వారిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. పట్టాలు పంపిణీ చేసిన అనంతరం కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ ‌జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ…తెలంగాణ వొచ్చిన తర్వాత పేదల బతుకుల గురించి ఆలోచించి చాలా కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. ‘తెలంగాణ వొచ్చిన తర్వాత పేదల బతుకులను ఆలోచించి చాలా కార్యక్రమాలు తీసుకున్నాం, ఒక్క ఆసిఫాబాద్‌ ‌జిల్లాల్లోనే 47 వేల ఎకరాలకు గిరిజన పోడు పట్టాలు ఇస్తున్నాం, మహిళల పేరు మీదే పోడు పట్టాలు ఉంటాయి. ఇందాకే డజన్‌ ‌పట్టాలు అందజేశా. రేపట్నుంచే వి• మంత్రి, ఎమ్మెల్యేలు ఈ 47వేల ఎకరాల భూమిని వెంటనే అందజేస్తారు.

రానున్న మూడు రోజుల్లోనే పట్టాలు అందుతాయి. పట్టాలు అందడమే కాదు.. అందరూ రైతులకు వొచ్చినట్టుగా పోడు పట్టాలు పొందినవారికి ఈ ఫసల్‌ ‌నుంచే రైతుబంధు రాబోతున్నది. గతంలో 300 కోట్లు పెట్టి ఎక్కడెక్కడ అటవీ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీఫేజ్‌ ‌వైర్‌ ‌కనెక్షన్‌ ‌లేదో అక్కడ 300 కోట్లు పెట్టి కరెంట్‌ ఇవ్వమని చెప్పినం. అయితే బావుల్లోకి ఇంకా పోలేదని ఆత్రం సక్కూ చెప్పారు. దీనిపై చీఫ్‌ ‌సెక్రటరీకి ఆదేశాలివ్వడం జరిగింది. ఎవరెవరు ఆదివాసీలు, గిరిజన బిడ్డలకు త్రీఫేజ్‌ ‌కరెంట్‌ ‌లేదో వాళ్లకు రాబోయే రెండు మూడు నెలల్లోనే పొలాలకు త్రీఫేజ్‌ ‌కరెంట్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. పోడుభూములు కొట్టుకున్నందుకు ఆదివాసీ గిరిజన బిడ్డల వి•ద గతంలో కేసులు పెట్టిండ్రు. ఒకవైపు పట్టాలు ఇచ్చి ఆ కేసులు అలాగే ఉంచితే తలాతోక లేనట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఆ కేసులను ఎత్తివేస్తాం..’ వారిపై కేసులు ఉండవని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అడవి ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు..మావా నాటె.. మావా రాజ్‌.. ‌నా గూడెంలో నా రాజ్యం..మా తండాలో మా రాజ్యం అని చెప్పేవాళ్లు. అనేక దశాబ్దాలు వి•రు పోరాటం చేసినా అది సాధ్యం కాలేదు. కానీ బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 3 నుంచి 4వేల గిరిజన గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాదు.. కుమ్రంభీమ్‌ ‌పేరిట కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ ‌జిల్లా ఏర్పాటు చేసుకున్నాం.

ఉద్యమం సమయంలో వి•రంతా సహకరించి నాతో పోరాటంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వొచ్చింది. తెలంగాణ వొచ్చింది కాబట్టే కుమ్రంభీమ్‌ ‌జిల్లా వొచ్చింది. ఈ రోజు ఆసిఫాబాద్‌ ‌జిల్లా చాలా చక్కటి ఎస్పీ, కలెక్టరేట్‌ ‌కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నందుకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు బెజ్జూర్‌ ‌నుంచి ఆదిలబాద్‌ ‌పోవాలంటే చాలా బాధపడేవాళ్లు. కానీ ఇప్పుడు జిల్లా కలెక్టరేట్‌, ‌జిల్లా ఎస్పీ కార్యాలయం, ఇంకా చాలా జిల్లా కార్యాలయాలు వి• ముంగిట్లకే రావడం చాలా సంతోషించే విషయమని సీఎం కేసీఆర్‌ అన్నారు.  వర్షాకాలం వొచ్చిందంటే మంచం పట్టిన మన్యం అని ఒకప్పుడు పేపర్‌లో వార్తలు వొచ్చేవి. అంటురోగాలతో ఆదిలాబాద్‌ ఆడవిబిడ్డలు సతమతమై చనిపోయేవాళ్లు. మిషన్‌ ‌భగీరథ ద్వారా చక్కటి నీళ్లు తెచ్చుకున్నాం.

వైద్య వ్యవస్థను బాగుచేసుకున్నాం కాబట్టి ఇవాళ మన్యం మంచం పట్టే సమస్య లేనే లేదు. గత మూడేండ్లుగా అటువంటి దుస్థితి నుంచి బయటపడ్డాం. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న ఆసిఫాబాద్‌లో మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు కావడం చాలా అద్భుతమైన విషయం. ఆ విషయంలో కూడా సక్కూకు, లక్ష్మీకి, వి• అందరికీ హృదయ పూర్వక అభినందనలు అని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు.  కోనేరు కోనప్ప వెంటబడి ప్రాణహిత వి•ద బ్రిడ్జి మంజూరు చేయించారు. కొన్ని కొత్త మండలాలు ఏర్పాటు చేయించారు. అదే విధంగా ఇప్పుడు కౌటాల మండలం నుంచి వార్దా నది వి•దుగా మహారాష్ట్ర పోవడానికి బ్రిడ్జి కావాలని చెప్పిండు. 75 కోట్లతో దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ జీవోను ఇప్పుడే అందజేస్తున్నా. ఆసిఫాబాద్‌కు టెక్నికల్‌ ‌కాలేజీ కావాలని కోనప్ప అడిగారు. వెంటనే ఐటీఐ కాలేజీని కాగజ్‌నగర్‌కు మంజూరు చేస్తున్నా అని తెలియజేసారు. నాగమ్మ చెరువులో బుద్ధుడిని పెట్టుకున్నాం.. దాన్ని మినీ ట్యాంక్‌బండ్‌లా ఏర్పాటు చేయాలని అడిగారు. వెంటనే ఎస్టిమేట్‌ ‌చేయించి నాగమ్మ చెరువును కూడా పర్యాటక కేంద్రంగా మారుస్తామని  సీఎం కేసీఆర్‌ ‌హామీ ఇచ్చారు.

వేదికపై సాయిచంద్‌కు కెసిఆర్‌ ‌నివాళి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభా వేదికపై తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌సాయిచంద్‌కు నివాళులు అర్పించారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన సాయిచంద్‌ ‌చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *