ముంబై, డిసెంబర్ 19 : బంగారం ధరలు భయపెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రోజురోజుకూ పెరుగుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.55 వేలకు చేరువలో ఉండటం సామాన్యులను కలవర పెడుతోంది. నిజానికి పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ భారీగానే ఉంది. కానీ రేటు చూస్తే కొండెక్కి కూర్చుంది. దీంతో బంగారం కొనలేక.. కొనక తప్పని పరిస్థితి కావడంతో ఏం చేయాలో తెలియక సామాన్యులు సతమతమవుతున్నారు. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా ఉండి కొనుగోలుదారులకు కాస్త ఊరట కల్పిస్తోంది. ఇక వెండి ధర మాత్రం అత్యంత స్వల్పంగా పెరిగింది.
సోమవారం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.69,300 లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,490గా ఉంది. విజయవాడలో 22 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,490గా ఉంది.


